వెల్‌కమ్ పవన్.. బీజేపీతో చేతులు కలుపుః జీవీఎల్

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఏపీ పాలిటిక్స్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి ఇప్పుడు రాజకీయంగా హీట్‌ను పెంచుతోంది. గత కొద్దిరోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. బీజేపీని మాత్రం పొగుడుతుండటం చూస్తుంటే.. త్వరలోనే జనసేన పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాక వీటిని నిజం చేస్తూ పవన్ ఇంకో అడుగు ముందుకేసి.. తాను ప్రత్యేక హోదా విషయంలోనే బీజేపీని విభేదించాను తప్పితే.. ఆ పార్టీకి తానెప్పుడూ […]

వెల్‌కమ్ పవన్.. బీజేపీతో చేతులు కలుపుః జీవీఎల్
Follow us

|

Updated on: Dec 05, 2019 | 11:21 AM

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఏపీ పాలిటిక్స్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి ఇప్పుడు రాజకీయంగా హీట్‌ను పెంచుతోంది. గత కొద్దిరోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. బీజేపీని మాత్రం పొగుడుతుండటం చూస్తుంటే.. త్వరలోనే జనసేన పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాక వీటిని నిజం చేస్తూ పవన్ ఇంకో అడుగు ముందుకేసి.. తాను ప్రత్యేక హోదా విషయంలోనే బీజేపీని విభేదించాను తప్పితే.. ఆ పార్టీకి తానెప్పుడూ దూరంగా లేనని స్పష్టం చేశారు.

ఇక సేనాని చేసిన కామెంట్స్‌కు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. కమలదళం పెద్దలు మాత్రం ఖుషీ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు. పవన్ పార్టీ విలీన ప్రతిపాదనతో వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల ముందే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయమని అడిగానని.. అప్పట్లో పవన్ అందుకు అంగీకరించలేదని జీవీఎల్ అన్నారు. అంతేకాకుండా మొదట్లో బీజేపీని వ్యతిరేకించిన వారు.. ఇప్పుడు కలిసి పని చేస్తామంటున్నారని.. పార్టీ విధివిధానాలతో ఏకీభవించి ప్రాంతీయ పార్టీలు విలీనానికి వస్తే.. వాటిని వెంటనే స్వాగతిస్తామని చెప్పారు. ఇకపోతే జనసేన పార్టీ విలీనంపై  సోషల్ మీడియాలో వస్తున్న వార్తల సందర్భంగా ఆ పార్టీ నేతలు దీనిపై స్పందించారు. బీజేపీతో పొత్తు, విలీనం ప్రసక్తి లేదని జనసేన పార్టీ నేత దుర్గేష్ స్పష్టం చేశారు.