AP Inter 2025 Exam Fee: తత్కాల్‌ పథకం కింద మరో ఛాన్స్.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులకు వచ్చే ఏడాది మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇక పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా పూర్తవగా.. తాజాగా ఇంటర్ బోర్డు మరోమారు ఫీజు చెల్లింపులకు అవకాశం ఇస్తూ ప్రకటన జారీ చేసింది..

AP Inter 2025 Exam Fee: తత్కాల్‌ పథకం కింద మరో ఛాన్స్.. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
Inter 2025 Exam Fee
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 25, 2024 | 7:58 AM

అమరావతి, డిసెంబర్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మర్చిలో జరగనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోమారు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. తత్కాల్‌ పథకం కింద ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించామని, డిసెంబరు 24 నుంచి 31 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు. గతంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు అపరాధ రుసుముతో కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా రూ.3 వేల చొప్పున చెల్లించాలని ఆమె సూచించారు. పరీక్ష ఫీజుకు సంబంధించి భవిష్యత్తులో ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని ఆమె స్పష్టం చేశారు.

ఇంటర్‌ (జనరల్‌, ఒకేషనల్‌) ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థులు, ప్రైవేట్‌ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ఇక ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు జరగనున్నాయి.

UPSC కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌ (GSE) తుది ఫలితాలు విడుదల.. ఎంత మంది ఎంపికయ్యారంటే?

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ‘కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2024’ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌, జూన్‌లో మెయిన్స్‌ నిర్వహించగా ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్‌ కింద జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2లో జియాలజిస్ట్, కెమిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. తాజా ఫలితాల్లో మొత్తం 69 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి

కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వివరాల కోసం క్లిక్‌ చేయండి.

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత