Crime News: విశాఖలో దారుణం.. సిగరెట్‌ కోసం స్నేహితుల మధ్య ఘర్షణ! బాలుడిని హతమార్చిన తోటి స్నేహితులు

|

Sep 24, 2023 | 8:15 AM

చిన్న తనంలోనే వ్యసనాలకు బానిసయ్యారు ఆ పిల్లలు. స్థానిక రౌడీ షీటర్‌ను ఆదర్శంగా తీసుకుని చెడు వ్యసనాలకు, మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డారు. తాజాగా సిగరెట్‌ కోసం వారి మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ బాలుడిని తన తోటి స్నేహితులు గొంతుకోసి హతమార్చాడు. అనంతరం మృత దేహాన్ని సముద్రంలో విసిరేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అనూహ్యం ఈ విషయం వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన విశాఖపట్నంలో స్థానికంగా..

Crime News: విశాఖలో దారుణం.. సిగరెట్‌ కోసం స్నేహితుల మధ్య ఘర్షణ! బాలుడిని హతమార్చిన తోటి స్నేహితులు
Murder For Cigarette
Follow us on

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 24: చిన్న తనంలోనే వ్యసనాలకు బానిసయ్యారు ఆ పిల్లలు. స్థానిక రౌడీ షీటర్‌ను ఆదర్శంగా తీసుకుని చెడు వ్యసనాలకు, మత్తు పదార్ధాలకు అలవాటు పడ్డారు. తాజాగా సిగరెట్‌ కోసం వారి మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఓ బాలుడిని తన తోటి స్నేహితులు గొంతుకోసి హతమార్చాడు. అనంతరం మృత దేహాన్ని సముద్రంలో విసిరేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అనూహ్యం ఈ విషయం వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన విశాఖపట్నంలో స్థానికంగా కలకలం సృష్టించింది. సీఐ రేవతమ్మ తెలిపిన కథనం ప్రకారం..

విశాకపట్నంలోని ఏవీఎన్‌ కాలేజీ సమీపంలో నూకాలమ్మ అనే ఒంటరి మహిళ తన కుమారుడు చిన్నా (17)తో కలిసి నివసిస్తోంది. కూలి పనులు చేసుకుంటూ నూకాలమ్మ బిడ్డను పోషించుకుంటోంది. ఈ క్రమంలో చిన్నా కొద్ది కాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. పాతనగరంలోని విస్కీ అనే రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకున్న చిన్నా సిగరెట్లు, గుట్కా వంటి పలు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 20వ తేదీన స్నేహితులతో కలిసి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. సెప్టెంబర్‌ 21న అర్ధరాత్రి దాటాక చిన్నా, మరో నలుగురు బాలురతో కలిసి సిగరెట్లు తాగారు. సిగరెట్‌ విషయమై వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. క్షణికావేశంలో స్నేహితులు నలుగురూ కలిసి చిన్నాను కత్తితో గొంతు కోసి హతమార్చారు. అనంతరం గోనె సంచితో మృతదేహాన్ని దాచి పెట్టారు.

వినాయకచవితి ఉత్సవ సామగ్రిని సముద్రంలో కలపాలని తెల్లవారుజామున ఆటోడ్రైవర్‌ రాముతో బేరం కుదుర్చుకున్నారు. ఆటోలో మృతదేహాన్ని చేపలరేవు వద్దకు తీసుకెళ్లి.. అక్కడ సముద్రంలో విసిరేసి వెళ్లిపోయారు. తాజాగా మృతదేహం తీరానికి చేరుకోవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు ఆటోడ్రైవర్‌ను తొలుత గుర్తించి విచారించారు. దీంతో అతను నలుగురు బాలురు గురించి పోలీసులకు తెలిపాడు. పోలీసులు నలుగురు బాలురను శనివారం (సెప్టెంబర్‌ 23) అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించగా.. ఆ నలుగురినీ జువైనల్‌ హోంకు పోలీసులు తరలించారు. పిల్లల మధ్య ఘర్షణకు గంజాయి కారణమై ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.