బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌

గ్యాస్‌ లీకేజీ అస్వస్థతకు గురైన బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పీవీ సుధాకర్ అన్నారు.

బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌

Edited By:

Updated on: May 07, 2020 | 11:19 AM

సాధారణంగా స్టెరీన్ వాయుడు ఊపిరితిత్తులపై తొలి ప్రభావం చూపుతుందని.. దీంతో అక్కడి నుంచి శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని అన్నారు. విష వాయువు మెదడు చేరి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడం వలన బాధితులు స్పృహ కోల్పోతారని ఆయన వివరించారు. కేజీహెచ్‌లో సెంట్రల్ వెంటిలేషన్ సిస్టమ్‌తో ఆక్సిజన్ అందిస్తున్నామని ఆయన అన్నారు. నేవీ రూపొందించిన మామ్‌తోనూ వెంటిలేషన్‌ సదుపాయం కల్పించామని పీవీ సుధాకర్‌ తెలిపారు. వైద్యులంతా అందుబాటులో ఉన్నారని.. బాధితుల్లో ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మృతుల సంఖ్య 8కు చేరింది. బాధితులకు చికిత్స కొనసాగుతోంది.

Read This Story Also: తక్షణమే చర్యలు తీసుకోండి: మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశం..!