‘ప్లాస్మా దానం’పై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని

| Edited By:

Aug 13, 2020 | 6:54 PM

ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దని.. కరోనా నుంచి కోలుకున్న వారు, అర్హులైన వారంతా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

ప్లాస్మా దానంపై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని
Follow us on

Alla Nani on Plasma donation: ప్లాస్మా థెరపీపై ఎలాంటి అపోహలు వద్దని.. కరోనా నుంచి కోలుకున్న వారు, అర్హులైన వారంతా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్లాస్మా దానం చేసే వారికి 5వేల రూపాయల ప్రోత్సహకాన్ని కూడా ఇస్తామని అన్నారు. ఆసుపత్రుల్లో అందుతోన్న సేవలు, కావాల్సిన సదుపాయాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ, సూచనలు చేస్తున్నారని అన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే  రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో రికవరీ రేటు కూడా అధికంగా ఉందని.. కరోనా కోసం ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ. 350 కోట్లను వెచ్చిస్తోందని తెలిపారు. ఆసుపత్రులలో బాధితులకు మెరుగైన వసతులు కల్పించి సేవలందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Read More:

‘బొజ్జ’నే అతడి ప్రాణాలనే కాపాడింది

కీర్తి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ‘గుడ్‌లక్ సఖి’ టీజర్‌ రెడీ