ప్రకాశం జిల్లాలో ఓ రైతు ఆగ్రహం

ప్రకాశం జిల్లాలో  ఓ రైతు ఆగ్రహం

ఎంతో కష్టపడి సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆ రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తాను సాగుచేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఓ రైతు తన పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని టమోటా పంటను సాగు చేశాడు ఆదిపుల్లయ్య అనే రైతు. ఇందుకోసం తను ఆ రైతు ఎకరాకు రూ.30,000 పెట్టుబడి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 16, 2019 | 2:09 PM

ఎంతో కష్టపడి సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆ రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తాను సాగుచేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఓ రైతు తన పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని టమోటా పంటను సాగు చేశాడు ఆదిపుల్లయ్య అనే రైతు. ఇందుకోసం తను ఆ రైతు ఎకరాకు రూ.30,000 పెట్టుబడి పెట్టాడు. ఆ పంటను తీసుకుని మార్కెట్ రాగా.. ఒక బాక్సును కేవలం రూన.40లకే కొంటామని అక్కడి వ్యాపారులు స్పష్టం చేశారు (ఒక్కో బాక్సులో 5 నుంచి 8 కిలోల టామోటాలు ఉంటాయి). దీంతో మనస్తాపం చెందిన ఆదిపుల్లయ్య టామోటాలను కింద పారబోసి నిరసన తెలిపాడు. మార్కెట్ కు బాక్స్ ను తీసుకురావడానికే రూ.20లు ఖర్చు అవుతుందనీ, ఇంత తక్కువ ధరకు అమ్మాల్సి వస్తే తామెలా బతకాలని ఆ రైతు వాపోయాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu