AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: స్టోర్ రూంలో తిష్టవేసిన భారీ కొండ చిలువలు.. వీడియో చూస్తే దడే..

అది ఓ స్టోర్ రూం.. అప్పుడప్పుడు అందులో సామాన్లు పెట్టడం కోసం మాత్రమే.. ఆ రూమ్‌లోకి వెళ్తుంటారు.. అలానే తాజాగా స్టోర్‌ రూమ్‌కు వెళ్లిన ఇంటి యజమానికి ఊహించిన పరిణామం ఎదురైంది.. డోర్ ఓపెన్ చయగానే రూమ్‌ తిస్టవేసిన ఓ భారీ కొండ చిలువ అతనికి కనిపించింది. అది చూసిన ఆ ఓనర్ ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు.

Watch Video: స్టోర్ రూంలో తిష్టవేసిన భారీ కొండ చిలువలు.. వీడియో చూస్తే దడే..
Visakhapatnam Python Rescue
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 29, 2026 | 10:03 PM

Share

విశాఖపట్నంలోని వడ్లపూడి ప్రాంతంలో ఒకే ఇంట్లో రెండు భారీ కొండచిలువలు కలకలం సృష్టించాయి. ఇంటి ఆవరణలోని స్టోర్ రూమ్‌లో తిష్టవేసిన ఈ భారీ కొండచిలువలను చూసిన ఓనర్ ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పరగులు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసిస్తున్న ఓ వ్యక్తి తమ ఇంట్లోని స్టోర్‌ రూమ్‌లో ఉన్న వస్తువు తెచ్చేందుకు వెళ్లాడు.. స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే.. ఏదో కదలిక రావడంతో టార్చ్ వేసి చూడగా, మెరుస్తున్న కళ్ళతో ఒక భారీ కొండచిలువ కనిపించింది. అంత పెద్ద పామును ఒక్కసారిగా చూసేసరికి ఆయన గుండె ఆగినంత పనైంది. వెంటనే అప్రమత్తమై స్టోర్ రూమ్ తలుపులు వేసేసి వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న స్నేక్ నాగరాజు వెంటనే అక్కడికిచేరుకొని కొండచిలువను పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. అయితే, లోపలికి వెళ్లిన స్నేక్ క్యాచర్ నాగరాజుకు మరో ఊహించని షాక్ తగిలింది. అక్కడ కేవలం ఒక కొండచిలువ మాత్రమే లేదు.. దాని పక్కనే మరో భారీ కొండచిలువ కూడా తిష్ట వేసి కూర్చుంది. ఒకే చోట రెండు భారీ సర్పాలు ఉండటం చూసి నాగరాజు సైతం షాకయ్యారు.

అయినా ఎంతమాత్రం బెదరకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహిరించి.. సుమారు 12 అడుగులు, 10 అడుగుల పొడవున్న ఆ రెండు భారీ కొండచిలువలను సురక్షితంగా పట్టుకున్నారు నాగరాజు. అనంతరం రెండు కొండచిలువలు నగర శివార్లోకి తీసుకెళ్లి వదిలేశాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్టోర్ రూంలో తిష్టవేసిన భారీ కొండ చిలువలు.. వీడియో చూస్తే దడే..
స్టోర్ రూంలో తిష్టవేసిన భారీ కొండ చిలువలు.. వీడియో చూస్తే దడే..
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు
పెళ్లి మీద తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అదే..
పెళ్లి మీద తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అదే..
తెలంగాణలో పవర్ కోసం బీజేపీ రూట్‌మ్యాప్.. రంగంలోకి మాస్టర్ మైండ్లు
తెలంగాణలో పవర్ కోసం బీజేపీ రూట్‌మ్యాప్.. రంగంలోకి మాస్టర్ మైండ్లు
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.!
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.!
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
మనవరాలి వయసున్న పాపపై ఘాతుకం.. కామాంధుడికి ఉరిశిక్ష
మనవరాలి వయసున్న పాపపై ఘాతుకం.. కామాంధుడికి ఉరిశిక్ష
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
థియేటర్లలో యావరేజ్.. కానీ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న తెలుగు మూవీ
థియేటర్లలో యావరేజ్.. కానీ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న తెలుగు మూవీ