AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా ఆరు లైన్ల నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే..

ఏపీలోని ప్రజలకు మరో గుడ్ న్యూస్. త్వరలో మరో కొత్త హైవే అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం ఆరు గంటల్లోనే బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. ఆరు లైన్ల రహదారిగా దీనిని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా ఆరు లైన్ల నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే..
Highway
Venkatrao Lella
|

Updated on: Jun 29, 2026 | 8:35 PM

Share

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరో కొత్త హైవే త్వరలో అందుబాటులోకి రానుంది. కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 342.24 కిలోమీటర్ల మేర హైవే పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్, జులై నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. రూ.14 వేల కోట్ల ఖర్చుతో భారతమాల పరియోజన తొలి దశ కింద ఈ ఆరు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం 5 జిల్లాల మీదుగా వెళుతుంది. ఈ హైవే పూర్తయితే కేవలం 6 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరు, విజయవాడ మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. బెంగళూరు, విజయవాడ, అమరావతి మధ్య ప్రయాణించేవారికి ప్రయాణ సమయం తగ్గనుంది.

60 శాతం పనులు పూర్తి

ఆరు వరుసల ఈ రహదారిని నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు చేపడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ హైవే పనులు పూర్తయితే.. ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల మీదుగా ఈ కొత్త హైవే నిర్మిస్తున్నారు. సత్యసాయి జిల్లాలో చితమత్తూరు, గోరంట్ల, ఓడీసీ, పుట్టపర్తి, నల్లమాడ, ముదిగుబ్బ మీదుగా తలుపుల మండలంలోని నామాలగుండ వద్ద వైఎస్సార్ కడప జిల్లాలోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో 78 కిలోమీటర్ల మేర ఈ ఆరు లైన్ల హైవే ఉండనుండగా.. 60 శాతం పనుల పూర్తయ్యాయి. ఇక వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, వేముల, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా హైవే వెళుతుంది.

ప్రకాశం జిల్లాలో 140 కిలోమీటర్లు

ప్రకాశం జిల్లాలో ఈ హైవే 140 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. సింగరాయకొండ నుంచి మైదుకూరు వెళ్లే ఎన్‌హెచ్ 167బీ వద్ద ఇంటర్ చేంజ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మర్రిపూడి నుంచి సోమవరప్పాడు వరకు 13వ ప్యాకేజీ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ హైవేలో భాగంగా 5.31 కిలోమీటర్ల మేర ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలోని 3.67 కిలోమీటర్ల మేర పొడవైన సొరంగం నిర్మిస్తున్నారు.

Follow Us