వార్నీ.. ఈ మహిళా దొంగ ఐడియా చూస్తే.. పోలీసులే షాక్.. వాటిని ఎక్కడ దాచారో తెలుసా..!

విశాఖలో జువెలరీ షాపులకు దొంగల బెడద పట్టుకుంది. మహిళా దొంగల ముఠాలు విశాఖలో దిగి హల్చల్ చేస్తున్నాయి. జువెలరీ షాపుల్లోకి చొరబడి.. నగలు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. కస్టమర్లలా వెళ్లి మాటలు కలిపి.. అవకాశం కోసం ఎదురు చూస్తూన్నాయి. మెల్లగా.. ఆభరణాలు నొక్కేసి వేర్వేరు చోట్ల పెట్టుకుని పారిపోతున్నాయి.

వార్నీ.. ఈ మహిళా దొంగ ఐడియా చూస్తే.. పోలీసులే షాక్.. వాటిని ఎక్కడ దాచారో తెలుసా..!
Female Thieves

Edited By:

Updated on: Jan 10, 2026 | 8:38 PM

విశాఖలో జువెలరీ షాపులకు దొంగల బెడద పట్టుకుంది. మహిళా దొంగల ముఠాలు విశాఖలో దిగి హల్చల్ చేస్తున్నాయి. జువెలరీ షాపుల్లోకి చొరబడి.. నగలు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. కస్టమర్లలా వెళ్లి మాటలు కలిపి.. అవకాశం కోసం ఎదురు చూస్తూన్నాయి. మెల్లగా.. ఆభరణాలు నొక్కేసి వేర్వేరు చోట్ల పెట్టుకుని పారిపోతున్నాయి. తాజాగా రెండు మహిళా దొంగల ముఠాలు విశాఖలో కలకలం సృష్టించాయి.

గాజువాక లోని బీసీ రోడ్‌లో ముగ్గురు సభ్యుల దొంగల ముఠా ఓ జ్యువెలరీ షాపును టార్గెట్ చేసింది. నాగమణి, జ్ఞానమ్మ, పద్మ అనే ముగ్గురు దొంగలు.. ఓం జ్యువెలరీ షాప్ లోకి వెళ్లారు. కస్టమర్లలా వెళ్లి.. చెవిరింగులు, జుంకాలు చూపించాలని కోరారు. కస్టమర్ అనుకుని షాపు సిబ్బంది వాళ్ల ముందు వేర్వేరు రకాల మోడల్స్ చెవి రింగులు, జూంకాలు పెట్టారు. కాసేపు అటు ఇటు కదిపిన ఆ ముగ్గురు మహిళలు.. మాటల్లో పెట్టి మస్కా కొట్టి.. కొన్ని వస్తువులను మాయం చేశారు. ఆలస్యంగా నైనా అప్రమత్తమైన సిబ్బంది.. వారిని నిలువరించారు. దీంతో తిరిగి దబాయించే ప్రయత్నం చేశారు ఆ ముగ్గురు మహిళా దొంగలు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు జువెలరీ షాప్ సిబ్బంది.

కొప్పులో ఆభరణాలు..

రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించారు. అప్పటికీ నోరు మెదపలేదు ఆ ముగ్గురు. పోలీసులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ మహిళ రెప్పపాటు లోనే.. తలకొప్పులో రింగులను దాచి పెట్టేసింది. ఆమెను తనిఖీ చేసేసరికి ఒక్కొక్కటిగా ఆభరణాలు తలకు నుంచి బయటపడ్డాయి. నాలుగున్నర గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి చోరీ స్టైల్ దాచే తీరును చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఈ ముగ్గురు దొంగలు విజయవాడకు చెందిన పాత నేరస్థులుగా గుర్తించారు పోలీసులు.

వీడియో ఇక్కడ చూడండి..

మరో దొంగల ముఠా పెందుర్తిలో హల్చల్ చేసింది. పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీలో నలుగురు మహిళలు వెళ్లారు. ఆభరణాలు కావాలని అడిగారు. చెవి బుట్టలు చూస్తూ… తస్కరించేశారు. మెల్లగా మస్కా కొట్టి పారిపోయే సమయంలో అప్రమత్తమమైన జువెలరీ షాప్ సిబ్బంది.. వారిని పట్టుకున్నారు. వెంటనే పెందుర్తి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. మహిళలను అదుపులోకి తీసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు.. విచారించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నాగమణి, రేణుక, కృష్ణవేణి, రవణమ్మగా గుర్తించారు పోలీసులు. వారి నుంచి చోరీ చేసిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..