Andhra News: ట్రాక్‌పై వస్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారిగా కూలిన విద్యుత్‌ పోల్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్‌ వైర్లపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకోపై ప్రమాదాన్ని గమనించి ట్రైన్ను ఆపేయడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Andhra News: ట్రాక్‌పై వస్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారిగా కూలిన విద్యుత్‌ పోల్‌.. తర్వాత ఏం జరిగిందంటే?
Tatanagar

Updated on: Nov 19, 2025 | 3:22 PM

విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతుండగా ట్రాక్‌ పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభం ఒక్కసారిగా ఒరిగి ఆ పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్‌ వైర్లపై పడిపోయింది. దీంలో ఆవైర్లు తెగి అక్కడే పనిచేస్తున్న కార్ముకులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు సహాయ ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

అయితే అదే సమయంలో అటుగా టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ వస్తోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తయ్యాడు. ట్రైన్‌ను ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు ఉద్యోగుల సహా ముగ్గురిని హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత విద్యుత్ అధికారుల సహయంతో విరిగి పడిన విద్యుత్‌ సంస్థాన్ని తొలగించి వైర్లను క్లియర్ చేశారు. దీంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us