Visakhapatnam Fire Accident Updates: విశాఖపట్నం జగదాంబ సెంటర్‌లోని ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదంతో ఉక్కునగరం ఉలిక్కిపడింది. ఆస్పత్రిలోని రెండో ఫ్లోర్‌లో మంటలు ఎగిశాయి. పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన టైమ్‌లో హాస్పిటల్‌లో 47 మంది ఇన్‌పేషెంట్లున్నారు. 20మంది ఐసీయూలో ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ ఫైటర్స్ సకాలంలో స్పాట్‌కు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.కానీ దట్టమైన పొగతో పేషెంట్లు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. వాళ్లందర్నీ హుటాహుటాని, కేజీహెచ్ దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదానికి కారణాలేంటి? షాట్ సర్క్యూట్ అని అంతా భావించారు. ఐతే ఆపరేషన్ థియేటర్‌లో నైట్రస్ ఆక్సైడ్ లీకేజీ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. విజేత ఆస్పత్రిలో 25 మందికి చికిత్స,మెడికవర్‌లో 19, KGHలో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు డాక్టర్లు. సకాలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో ముప్పు తప్పింది. మరి నిప్పు వెనుక నిజాలేంటి? నిర్లక్ష్యం ఎవరిది?
ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాద ఘటనపై ఆరాతీశారు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్‌నాధ్. పేషెంట్లు వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా వుంటుందని భరోసానిచ్చారు.ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.
అగ్నిప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం కొనసాగుతోంది. ఐతే వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్‌గా ఉందన్నారు వైద్యులు. యాజమాన్య నిర్లక్ష్యమే అగ్రిప్రమాదానికి కారణమనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..