
నడిసంద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని ఆపద వచ్చి పడింది. చేపల వేట చేసి కాస్త సేద తీరుతున్న సమయంలో ఓ కార్గో నౌక వారి పవడవను ఢీకోట్టింది. దీంతో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఆ పడవలో ఉన్న మత్స్యకారులందరూ ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. అందరూ ఈతలో ఆరితేరినవారు కావడంతో ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అతి కష్టం మీద ఒడ్డుకు చేరారు. పైకి వచ్చాయ చూసుకుంటే.. ఐదుగురు మాత్రమే ఉన్నారు.ఇంకో మత్స్యకారుడు మాత్రం తిరిగి తీరానికి చేరలేదు.
ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సముద్రంలో చోటుచేసుకుంది. అచ్యుతాపురం మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొమరాని నీలాకరి, పూడిమడకకు చెందిన వాసుపల్లి సత్తయ్య, గున్నయ్య, బంగారురాజు,పరిదేశీ, గణేష్ సూరిబాబు ఈనెల 23 న పూడి మడక నుంచి చేపలు వేటకు వెళ్లారు. IND -AP-V3-MO 1679 నెంబర్ గల బోట్ లో సముద్రం లో బయలుదేరారు. సముద్రంలో చేపల వేట సాగించారు. భారీగానే చేపలు చిక్కాయి. వేటాడి తీవ్రంగా అలసిపోయిన ఆరుగురు మత్స్యకారులు విశ్రాంతి కోసమని.. పడవను సముద్ర మద్యలోనే ఆపుకొని ఉన్నారు. ఇంతలోనే పెను ప్రమాదం ముంచుకొచ్చింది.
ఓ భారీ కార్గో షిప్ వచ్చి.. విశ్రాంతి తీసుకుంటున్న మత్స్యకారుల బోటును ఢీకొట్టింది. దీంతో బోటు సముద్రంలో బోల్తా పడింది. అందులో ఉన్న మత్స్యకారులంతా సముద్రంలో పడిపోయారు. అయితే వారిలో వాసుపల్లి సత్తయ్య, గున్నయ్య, బంగారురాజు, పరిదేశీ, గణేష్ ,సూరిబాబు అయిదుగురు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని సురక్షితంగా పూడిమడక తీరానికి చేరుకున్నారు. కానీ నీలాకరి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. దీంతో తోలి మత్స్యకారులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న అధికారులు గల్లంతైన మత్స్యారుడికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.