AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఆ ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

ఏపీలో కూటమి సర్కార్‌ కొలువుదీరబోతోంది. జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు...

Andhra Pradesh: ఏపీలో ఆ ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు
Chandrababu Naidu
Subhash Goud
|

Updated on: Jun 11, 2024 | 12:15 PM

Share

ఏపీలో కూటమి సర్కార్‌ కొలువుదీరబోతోంది. జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం విజయవాడలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే విశాఖను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని, కర్నూలును కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఏపీ ప్రజలు గతంలో ఎప్పుడూ ఇవ్వని తీర్పునిచ్చారని, ఏపీ ప్రజలు ఐదేళ్లు విధ్వంసకర పాలన చూశారని, అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని అన్నారు.

1994లో ఏకపక్ష ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేదని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడపలో 7కు 5 సీట్లు గెలిచాం.. అభ్యర్థులు గట్టిగా నిలబడ్డ చోట ప్రజలు ఆశీర్వదించారు.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఢిల్లీలో మమ్మల్ని గౌరవించారని చంద్రబాబు అన్నారు. ఈ తీర్పుతో రాష్ట్ర గౌరవం పెరిగింది.. గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయించాం.. టీడీపీ, జనసేన పొత్తు గురించి తొలిసారి చెప్పిన వ్యక్తి పవన్ అని గుర్తు చేశారు చంద్రబాబు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్లు ఏపీ ప్రజలు విపత్కర పరిస్థితులు చూశారని, ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. కూటమి అంటే ఎలా ఉండాలో ఏపీ ప్రజలు దేశానికి చూపించారన్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, కావల్సిన చోట తగ్గాం.. 5 కోట్ల మంది ప్రజలు మనపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు కావాలని, ఈ సమయంలో చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరం అని పవన్‌ అన్నారు. మందుపాతరలు పేలినా బయటపడ్డ నాయకుడు చంద్రబాబు.. ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రతిపాదిస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

ఇక పురంధేవ్వరి మాట్లాడుతూ.. కూటమిగా అనూహ్య విజయం సాధించాం.. 3 పార్టీల కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. గత ఐదేళ్లుగా నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారు. ఇంతటి ఘన విజయం మనం ఊహించలేదని అన్నారు. మూడు పార్టీల కలయిక రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావించారని ఆమె గుర్తు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం