andhra pradesh: 40ఏళ్లుగా పాలకులు చేయలేని పని.. 16 గ్రామాల ప్రజలు కలిసికట్టుగా సాధించారు.. పండగలా ప్రారంభోత్సవం

|

Aug 27, 2022 | 9:30 AM

సుమారు 16 గ్రామాల ప్రజలు ఏకమై, శ్రమదానం చేశారు, నాలుగు దశాబ్దాల తమ కలను నెరవేర్చుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండల ప్రజలు తమ ప్రాంతంలోని త్రిపురాంతకం..

andhra pradesh: 40ఏళ్లుగా పాలకులు చేయలేని పని.. 16 గ్రామాల ప్రజలు కలిసికట్టుగా సాధించారు.. పండగలా ప్రారంభోత్సవం
Gundlakamma River
Follow us on

andhra pradesh: ప్రభుత్వాలు మారినా ఫలితం లేకపోవడంతో చివరకు ప్రజలే ముందుకు కదిలారు. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధుల తీరుతో విసిగి వేసారిన ప్రజలు తామే గుండ్లకమ్మ వాగుపై చిన్న బ్రిడ్జ్ కట్టుకోవాలని నిర్ణయించారు.సుమారు 16 గ్రామాల ప్రజలు ఏకమై, శ్రమదానం చేశారు, నాలుగు దశాబ్దాల తమ కలను నెరవేర్చుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండల ప్రజలు తమ ప్రాంతంలోని త్రిపురాంతకం వెళ్లేందుకు రవాణా మార్గం ఏర్పాటు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం-కురిచేడు మండలాల మధ్య రాకపోకలకు గుండ్లకమ్మ వాగు అడ్డంకిగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోవాల్సిందే. పక్కపక్కనే ఉన్నా, త్రిపురాంతకం నుంచి కురిచేడు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. అందుకే, గుండ్లకమ్మ వాగుపై చప్టా నిర్మాణం చేపట్టాలని 40ఏళ్లుగా వేడుకుంటున్నారు 16 గ్రామాల ప్రజలు. ప్రభుత్వాలు మారుతున్నా, తమ సమస్య మాత్రం తీరకపోవడంతో వాళ్లే ముందుకొచ్చి చప్టా నిర్మించుకున్నారు. ప్రతి కుటుంబం నుంచి చందాలు వసూలుచేసి 20లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. వంతెన ప్రారంభోత్సవాన్ని ఊరంతా పండగలా జరుపుకున్నారు.

చప్టా నిర్మాణం కోసం రైతులు, గ్రామస్తులే… ఇంజనీర్లుగా, మేస్త్రీలుగా, కూలీలుగా అవతారమెత్తారు. వాగుపై కాంక్రీట్‌ బెడ్‌ నిర్మించి, దానిపై పెద్దపెద్ద తూములు అమర్చి, చప్టాను నిర్మించుకున్నారు. 40రోజుల్లో మొత్తం పనులు పూర్తిచేసి రైతులంతా కలిసి ప్రారంభించుకున్నారు.ఈ వారధి పూర్తి కావటంతో చుట్టు తిరిగి వెళ్లాల్సిన శ్రమ తగ్గిందని ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి