విజయవాడ టూ షిర్డీ.. చాలా లాంగ్ జర్నీ.. అయితే 20 గంటల పాటు ట్రైన్‌లో ప్రయాణించాలి. లేదా.. హైదరాబాద్ వెళ్లి.. అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఇకపై ఇలాంటి వర్రీస్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్ చెక్ పెట్టింది. విజయవాడ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం(మార్చి 26) నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
మార్చి 26వ తేదీన మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణీకులతో మొదటి ఫ్లైట్ విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి షిర్డీ వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.35 గంటలకు 66 మంది ప్రయాణికులతో షిర్డీ నుంచి బయల్దేరిన విమానం.. తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. తొలి రోజే ఈ విమాన సర్వీసుకు మంచి ఆదరణ లభించిందని.. ప్రయాణీకులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు.
కాగా, ఏటీఆర్ 72-600 విమానం ప్రతీ రోజూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరుతుంది. ఈ సర్వీసులు వారం అంతటా అందుబాటులో ఉంటాయి. ఇకపై 20 గంటలు కాదు.. విజయవాడ నుంచి షిర్డీకి కేవలం 2 గంటల 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి షిర్డీకి టికెట్ ధర 4,246 కాగా.. షిర్డీ నుండి రిటర్న్ టికెట్ ధర 4,639గా నిర్ణయించారు. అటు హైదరాబాద్ నుంచి షిర్డీ ఫ్లైట్ ధరలు దాదాపు రూ. 5 వేల నుంచి 7 వేల వరకు ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..