మీరు లక్షాధికారి అవ్వాలనే ఆశ.. మీ పేదరికమే వాళ్ళ పెట్టుబడి.. మీ ఆర్థిక అవసరాలు వాళ్ళకు ఆసరా.. తియ్యని మాటలు చెప్పి మిమ్మల్ని లక్షాధికారులను చేస్తామని నమ్మిస్తారు. మీరు పెట్టుబడి పెట్టొద్దను మిమ్మల్ని ఒప్పిస్తారు. కష్టంతో పని లేకుండా కడుపు నింపుకునెలా చేస్తామని మాటల్తో బురిడీ కొట్టిస్తారు. ఏపీలో ఇటీవల ఎవరికీ దొరకకుండా కోన్ని గ్యాంగ్ లు నడుపుతున్న తెర వెనుక వ్యవహారం మీకే తెలియకుండా మిమ్మల్ని మోసం చేస్తూ, మిమ్మల్ని బాధితులను చేస్తున్నారు. మీరే నేరస్తులుగా మిగిలి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. అస్సలు దీని వెనుక ఉన్న కథ ఎంటి? బెజవాడ కేంద్రంగా బయటపడ్డ అక్రమ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన నిజాలు ఏంటి? దీనిపై పోలీసులు ఏమంటున్నారు..
ఏపీలో కిడ్నీలను ఇడ్లిళ్లా అమ్మేస్తున్నారు. కోట్లు వస్తాయను ఆశ చూపి పేదలను బలవంతంగా కిడ్నీ రాకెట్ మాఫియాలోకి లాగుతున్నారు. ఇటీవల ఏపీలో వరుసగా కిడ్నీలను అమ్మేస్తున్న మాఫియా విజయవాడ కేంద్రంగానే ఈ అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారానికి పేదలను బలి పశువులను చేస్తుంది. కిడ్నీ ఇచ్చిన పాపానికి వారు నేరస్తులుగా మిగులుతున్నారు తప్ప అసలైన నేరస్తులకు మాత్రం శిక్ష పడటం లేదు. ఇప్పటికే వరుసగా ఏపీలో వెలుగులోకి వస్తున్న కిడ్నీ రాకెట్ ఘటన సంచలనం సృష్టిస్తుంటే.. విశాఖపట్నం, విజయవాడ, ఏలూరులో జరిగిన వరసగా జరిగిన ఘటన మర్చిపోకముందే.. తాజాగా విజయవాడలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అయితే, గత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కిడ్నీ మార్పిడి ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోని తేడాలు రావడంతో వెలుగులోకి వస్తే తాజాగా నేడు విజయవాడలో బయటపడిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అధికారులు ముందుగా ఈ అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టారు విజయవాడ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ మాఫియాను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేరుగా రెవిన్యూ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారం బట్టబయలైంది.
భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నా విజయవాడకు చెందిన ఒక రెవెన్యూ ఉన్నతాధికారి ఈ అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అటు బాధితులను ఇటు నిందితులను సకాలంలో గుర్తించారు విజయవాడ భవానిపురం పోలిసులు. అయితే అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విజయవాడ బెస్ట్ ఎమ్మార్వో లక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం మొత్తం వీళ్లకు వచ్చింది దీంతో కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన డోనర్ తో పాటు కిడ్నీ తీసుకునేందుకు సిద్ధమైన వ్యక్తిని సైతం పోలీసులు విచారిస్తున్నారు
విజయవాడలో తాజాగా బయటపడిన ఘటనలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెనుక సమిధులుగా మారుతుంది రోజువారీ కూలీలు పేదలు ఆర్థిక ఇబ్బందులతో జీవితాన్ని ఇచ్చుకొస్తున్న వాళ్లే అన్నది మరోసారి బట్టబయలైంది విజయవాడ గొల్లపూడి కి చెందిన చిన్ని అనే మహిళ రోజువారి కూలీలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండగా ఆ మహిళకు కుటుంబానికి సమీపంలో నివసించే మరో మహిళ కిడ్నీ ఇవ్వాలంటూ అందుకు లక్షల ఆశ చూపింది స్వతహాగా పేదరికంతో మగ్గుతున్న చిన్ని కుటుంబం ఆశ చూపిన 7 లక్ష రూపాయలకు కిడ్నీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు అయితే కిడ్నీ మార్పిడి కోసం లీగల్ గా చాలా ప్రొసీడింగ్స్ క్లియర్ చేయాల్సి ఉండటంతో రెవెన్యూ అధికారులకు కిడ్నీ తీసుకుంటున్న వ్యక్తి తమ బంధువు అంటూ వరుసకు సోదరుడు అవుతాడు అంటూ అనుమతి కోసం ఎన్వోసీ ఇవ్వాలంటూ ఎమ్మార్వోకి అప్లై చేయడంతో విచారణలో అక్రమ కిడ్నీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అయితే, ప్రస్తుతం అక్రమ కిడ్నీ రాకెట్ లో ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకున్నాయని కిడ్నీ ఇస్తున్న వ్యక్తికి కిడ్నీ తీసుకుంటున్న బాధితుడికి ఏ మాత్రం బంధుత్వం లేదని కానీ అప్పుడు వీటిలో మాత్రం తన సోదరుడు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఎమ్మార్వో భవానిపురం పోలీసులకు అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు దీంతో విజయవాడ వేదికగా అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారం జరుగుతుందని గ్రహించిన దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు భవానిపురం పోలీసులు దీనితో ఈ అక్రమ కిడ్నీ రాకెట్టు వాస్తవమైన తేల్చిన భవానిపురం పోలీసులు మధ్యవర్తి ఇటు కిడ్నీ తీసుకుంటున్న పేషంట్ తో పాటు ఇస్తున్న డోనర్ వివరాలు లాబట్టే పనుల నిమగ్నమయ్యారు అయితే ఇప్పటికే ఎవరైతే కిడ్నీకి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మహిళ ఉన్నారో ఆమెను అదుపులోకి తీసుకొని భవానిపురం పోలీస్ స్టేషన్లు విచారణ చేపట్టగా కిడ్నీ తీసుకునేందుకు సిద్ధమైన దీపక్ రెడ్డి అలాగే మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళలకు మహిళ కోసం గాలిప చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..