Krishna District: యాక్షన్‌లోకి దిగిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్.. వారికి వాటర్, డ్రైనేజీ కనెక్షన్లు కట్

|

Mar 17, 2022 | 3:58 PM

విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పన్ను బకాయిదారులకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసింది. పన్ను చెల్లించనివారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది.

Krishna District: యాక్షన్‌లోకి దిగిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్.. వారికి వాటర్, డ్రైనేజీ కనెక్షన్లు కట్
Vijayawada Municipal Corpor
Follow us on

Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పన్ను బకాయిదారులకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేసింది. పన్ను చెల్లించనివారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది. ఇప్పుటివరకు నోటీసులు మాత్రమే అందుకున్నారు.. ఇకపై యాక్షన్ ఏంటో చూస్తారని క్లియర్ కట్‌గా చెప్పేసింది. కొందరికి ఎన్ని నోటీసులు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.. అలాంటి వారి నుంచి ముక్కుపిండి బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎక్కువకాలం పెండింగ్ లో ఉన్న బకాయిదారుల ఆస్తులు ఏకంగా జప్తు చేయాలని వీఎంసీ నిర్ణయం తీసుకుంది.  ఈ నెల 31 లోగా పన్నులు చెల్లించకుంటే వాటర్, డ్రైనేజీ కనెక్షన్లు తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.  ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, కుళాయి పన్ను, డ్రైనేజీ పన్నులు చెల్లింపుకు మార్చి 31ను డెడ్‌ లైన్ కింద పెట్టింది. పన్ను బకాయిలు వసూలు కోసం నగరపాలక సంస్థ పరిధిలో 3 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. సెలవు దినములలో కూడా సదరు కౌంటర్లు పని చేస్తాయని డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) డి. వెంకట లక్ష్మి తెలియజేశారు. పౌరులు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Telangana: ఘాటులోనే కాదు రేటులోనూ తగ్గేదే లే.. బంగారం ధరలో పోటీ పడుతున్న మిర్చి

 కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే