Helping Hands: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను సొంత కుటుంబ సభ్యులు సైతం ముట్టుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. అందరూ ఉండి అనాధ శవాల్లా అంతిమసంస్కారాలు నిర్వహించిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి విపత్కరం సమయంలో కొందరు సహృదయంతో సాయానికి ముందుకు వస్తున్నారు. కరోనా సోకి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నారు. మరికొందరైతే.. కరోనాతో చనిపోయిన వారికి ఉచితంగా దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఇలాంటి సేవలు అందిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి మానవతావాదులకు కొదవ లేదు. స్వయంగా వారే ప్రకటిస్తున్నారు. కరోనా బాధితులకు అండగా ఉంటామని, అవసరం ఉన్నవారు తమను సంప్రదించాలని ప్రకటిస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్.. కరోనా బాధితులకు తామున్నామంటూ ముందుకు వచ్చింది. విజయవాడలో ఎవరికైనా కరోనా వచ్చి భోజనానికి ఇబ్బంది పడినా.. మందులు తీసుకువచ్చే వాళ్లు లేకపోయినా తనను సంప్రదించాలంటూ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ సభ్యుడు వెంకట్ ముందుకు వచ్చారు. ‘నా పేరు వెంకట్. ఉండేది విజయవాడ. కరోనాతో చనిపోయిన వాళ్లని తీసుకుపోవడానికి డ్రైవర్స్ రాకపోతే నాకు కాల్ చేయండి. కరోనా మృతుల అంత్యక్రియలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ – 9949926465, 88852 12130 నెంబర్లను సంప్రదించవచ్చు. అలాగే. కరోనా వచ్చి భోజనానికి, మందులు తీసుకొచ్చే వాళ్ళు లేక ఇబ్బంది పడేవారు ఉంటే 9949926465 నెంబర్‌కి కాల్ చేయండి. కోవిడ్ వల్ల ఎవరైనా చనిపోయిన సాయం చేసే వాళ్ళు లేకపోతే మీ కోసం మేము ఉన్నాం. ఎలాంటి సర్వీస్ చార్జీలు తీసుకోబడదు.’’ అంటూ ప్రకటించారు.
Also read:
Tammineni recovered : కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న స్పీకర్ తమ్మినేని దంపతులు