Durga Temple: దుర్గమ్మ భక్తులకు అలెర్ట్.. కొత్త నిబంధనలు జారీ.. దర్శనాలకు అది తప్పనిసరి..

|

Sep 24, 2021 | 9:00 AM

Dasara Navaratri Utsavalu: కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రీపై దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Durga Temple: దుర్గమ్మ భక్తులకు అలెర్ట్.. కొత్త నిబంధనలు జారీ.. దర్శనాలకు అది తప్పనిసరి..
Vijayawada Temple
Follow us on

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రీపై దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన దేవాదాయశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా నిర్ధారించే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

అలాగే తెల్లవారుజాము నుంచే దర్శనాలకు అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని.. ప్రతీరోజూ ఉచిత దర్శన టికెట్లపై 4 వేల మంది, రూ.300 టికెట్లపై 3 వేలు, రూ. 100 టికెట్‌పై మరో 3 వేల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చునని అన్నారు.

ఇక భవానీలు తమ స్వస్థలాల్లోనే దీక్షను విరమణలు చేసుకోవాలని తెలిపారు. కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించబోమని, వీఐపీ భక్తుల కోసం ప్రత్యేకంగా 15 వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ జే నివాస్ వెల్లడించారు. కాగా, మూలా నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read:

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!

ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!