బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు బట్టబయలు..

విజయవాడ కొత్తపేటలో పదేళ్లుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న బీహార్‌కు చెందిన మహమ్మద్ అబుతాలిబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా నుంచి యువతులను రప్పించి, బంగ్లాదేశ్ లింకులతో ఈ అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. మొదట దేశ భద్రతా కోణం పరిశీలించినా, అది వ్యభిచార గృహ నిర్వహణ కేసుగానే నిర్ధారించారు. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన రేపింది.

బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు బట్టబయలు..
Woman Arrest

Edited By:

Updated on: Jan 22, 2026 | 2:26 PM

విజయవాడ కొత్తపేటలో బీహార్ చెందిన ఓ వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.. బంగ్లాదేశ్ , కోల్కత్తా ప్రాంతాల మధ్య వ్యభిచార ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మహమ్మద్ అబుతాలిబ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయసంగా మారింది..

బీహార్ కు చెందిన మహమ్మద్ అబుతాలిబ్ అనే వ్యక్తి విజయవాడ కొత్తపేట ప్రాంతంలో వించిపేటలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకొని గత పదేళ్లుగా నివసిస్తున్నాడు.. కోల్కత్తా కు చెందిన యువతిని వివాహం అబుతాలిబ్ కు ఇద్దరు సంతానం ఉన్నారు.. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది.. ప్రస్తుతం అబతాలిబ్ ఒక్కడే జీవనం కొనసాగిస్తున్నాడు.. అయితే ఇటీవల బయటకు సాధారణ జీవితం గడుపుతూ లోపల అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.. బ్యాగులు , ఫోన్ పౌచ్ తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు అబుతాలిబ్ స్థానికులకు సాధారణ వ్యక్తిగా కనిపించేవాడు.. అయితే కోల్కత్తా వెళ్లిన సందర్భంలో అక్కడి మహిళతో పరిచయాలు పెంచుకొని వారి ద్వారా యువతులను విజయవాడకు రప్పించి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.. దీంతో పోలీసులకు అందిన సమాచారం మేరకు నిఘా పెంచిన అధికారులు ఇటీవల అబుతాలి కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందడంతో అతని కదలికలపై నిగా పెట్టిన పోలీసులు అతని ఇంటికి అనుమానాస్పదంగా మహిళలు రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించారు.. అంతేకాదు అతని చెరలో ఉన్న కోల్కత్తా కు చెందిన ఓ యువతని గుర్తించి పోలీసులు రక్షణ కల్పించారు.. అనంతరం బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులతో తరచూ ఫోన్ సంభాషణలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు..

బంగ్లాదేశ్ ఫోన్ కాల్స్ తో మరిన్ని అనుమానాలు పెరిగాయి.. విచారణలో మరొక కీలక విషయం వెలుగులకు వచ్చింది.. అబుతాలిబ్ బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులతో తరచూ ఫోన్ లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించి ఈ వ్యవహారానికి అంతర్జాతీయ కోణం ఉందా అనే కోణంలో.. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయా .. అనే అనుమానాలు తలెత్తాయి.. ఈ నేపథ్యంలో అబుతాలిబ్ను అధికారులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.. అనంతరం దేశానికి సంబంధించిన కుట్రలు ఏమీ లేవని తేలినట్టు సమాచారం..అంతర్జాతీయ కోణం లేదని నిర్ధారణ కావడంతో వ్యభిచార గృహం నిర్వహణ కేసులో అబుతాలిబ్ ను పోలీసులు అరెస్టు చేశారు..

ఇవి కూడా చదవండి

మరో వైపు స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.. పదేళ్లుగా తమ మధ్య ఉంటూ ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగుతున్న అన్న విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇక విజయవాడ కేంద్రంగా బంగ్లాదేశ్ , కోల్కత్తా ప్రాంతాల మధ్య లింకులు బయటపడటం పట్ల ప్రజల్లో చర్చ మొదలైంది.. ఇలాంటి కార్యకలాపాలు పై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. వ్యభిచార కార్యకలాపాలపై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..