Vangaveeti Ranga Statue: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లిలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పలువురు కాపు నేతలు హాజరయ్యారు. విగ్రహావిష్కరణలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు , చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వంగవీటి రంగాని గుర్తు చేసుకున్నారు. రానున్న కాలంలో ఏపీలోని రాజకీయాలను శాసించేది కాపులేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. అంతేకాదు.. మహాత్మాగాంధీ, డా. బి ఆర్ అంబేద్కర్ తరువాత రాష్ట్రంలో అత్యధిక విగ్రహాలు కలిగిన ఏకైక నాయకుడు రంగా మాత్రమేనని చెప్పారు.
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని.. అయితే కాపు నాయకులు ఏ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ వారికి కాపులు అండగా నిలబడాలని సూచించారు. వారిని ప్రోత్సహించమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. ఇక చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో 2 లక్షల విగ్రహాలు వున్న ఏకైక నాయకుడు రంగా మాత్రమేనని చెప్పారు.
Also Read: ఈ టికెట్ ధరతో సినిమా చూడడం మా వల్ల కాదు.. థియేటర్లు మూసేయండి నాయనా..నెటిజన్స్ ట్రోల్