ఇవి సూపర్ స్పెషల్.. పసుపు మిరపకాయల గురించి మీకు తెలుసా..? విదేశాల్లో యమ డిమాండ్

Yellow Chili Peppers:: పసుపు పచ్చని కారం .. ఏంటి కారం పచ్చగా ఎందుకు ఉంటుంది.. పసుపు కదా అనుకుంటున్నారా .. నిజమండి బాబు . ఇపుడు పచ్చని కారం మిరపకాయలు సైతం ఏలూరు ఏజెన్సీ వేలేరుపాడులో పండుతున్నాయి. వేలేరుపాడు మండలం నడిమిగుమ్మి గ్రామానికి చెందిన రైతు బుడిపిటి విక్రం వీటిని పండిస్తున్నారు.

ఇవి సూపర్ స్పెషల్.. పసుపు మిరపకాయల గురించి మీకు తెలుసా..? విదేశాల్లో యమ డిమాండ్
Mirchi

Edited By:

Updated on: Jan 14, 2026 | 9:16 AM

ఏలూరు : పసుపు పచ్చని కారం .. ఏంటి కారం పచ్చగా ఎందుకు ఉంటుంది.. పసుపు కదా అనుకుంటున్నారా .. నిజమండి బాబు . ఇపుడు పచ్చని కారం మిరపకాయలు సైతం ఏలూరు ఏజెన్సీ వేలేరుపాడులో పండుతున్నాయి. వేలేరుపాడు మండలం నడిమిగుమ్మి గ్రామానికి చెందిన రైతు బుడిపిటి విక్రం వీటిని పండిస్తున్నారు. ఈయన తన 5 ఎకరాల పొలంలో ఒక ఎకరంలో పసుపు పచ్చ మిర్చి వేస్తే.. మరో నాలుగు ఎకరాల్లో ఎర్రని మిర్చి పండుతుంది. దీంతో పసుపు, ఎరుపు కలిసిన ఈ పొలం ఏలూరు ఏజెన్సీకి కొత్త అందాన్ని తెచ్చి పెట్టింది. సాధారణంగా చేలో పసుపు పచ్చని బంతి పూలు విరపూస్తే చూడ ముచ్చటగా ఉంటుంది కదా.. మిరప చేను కోతకు వచ్చిన సమయంలో పండు మిరపకాయల్తో కొమ్మలు భారంగా ఒరిగితే వాటి ఎరుపు రంగు, చెట్టు ,ఆకుల ఆకుపచ్చదనంతో మిరపతోటలు అందంగా కనిపిస్తాయి. మార్కెట్లో కాప్సికం మిర్చి రకంలో ఇలా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు చూస్తాము. కానీ సాధారణ మిరపలోనూ ప్రత్యేకంగా పసుపు రంగుతో పండే మిరప ఇపుడు ఇతర రైతులను సైతం ఆకట్టుకుంటుంది.

వీడియో చూడండి..

మంచి ధర లభిస్తుందంటున్న రైతు..

గుంటూరు నుంచి తెచ్చిన యూవీ , నరింగా ఎఫ్ – 1 హైబ్రిడ్ చిల్లీ విత్తనాలు చల్లి.. ఆ నారు వేసిన ఎకరం పసుపు మిరప చేనుకు రూ 1.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టగా 25 క్వీన్ టాళ్ళ దిగుబడి వచ్చినట్లు రైతు చెబుతున్నారు. గుంటూరు మార్కెట్లో ఈ ఏడాది క్విన్టా ధర రూ.40 వేలవరకు ఉండగా గత ఏడాది 60 వేల వరకు ధర పలికిందని రైతు చెబుతున్నారు.

విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న మిరప..

పసుపు రంగు మిరపను ప్రత్యేకంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహార పదార్ధాల తయారీలో రంగు ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ తరహా మిర్చిని వాడుతున్నారు. మరోవైపు లెస్ వంటి స్నాక్స్‌లో గార్నిష్ ఐటంగా కూడా ఈ మిర్చి వినియోగంలో ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..