Vijayawada: బెజవాడ నడిబొడ్డున ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్ ప్రారంభం..

|

Feb 17, 2022 | 4:55 PM

AP News: విజయవాడలో కీలకమైన బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్‌ను కేంద్ర రవాణా శాఖ మంత్రి, సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి, నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వర్చువల్ పద్ధతిలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు.

Vijayawada: బెజవాడ నడిబొడ్డున ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్ ప్రారంభం..
Vijayawada Benzcircle Fly over
Follow us on

Benz Circle Flyover 2: విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్-2ను ప్రారంభించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 88 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. . గతంలోనే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ప్లాన్ చేసినా.. రెండు, మూడు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు అందుబాటులోకి రావడంతో విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అంతకుముందు ఏపీ(Andhra Pradesh)లో 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు నితిన్ గడ్కరీ..2024 కల్లా రాష్ట్రంలో 3 లక్షల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. కొత్తగా 22 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేస్‌ నిర్మిస్తున్నామని..ఇందులో 6 ఏపీ గుండా వెళ్తాయని చెప్పారు. ఇక ఏపీపై వరాల జల్లు కురిపించారు నితిన్ గడ్కరీ. విజయవాడ తూర్పు ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే CM జగన్ 20 R.O.Bలు కావాలని అడిగితే 30 R.O.Bలు మంజూరు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి 10 వేల 600 కోట్లు కేటాయించినట్లు చెప్పారు CM జగన్. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి 2 లైన్ల రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో.. రాష్ట్రంలోని రోడ్ల రూపురేఖలను మార్చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి అసంపూర్తిగా ఉన్న తూర్పు ఫ్లైఓవర్‌, కనకదుర్గ ఫ్లైఓవర్‌ను.. గడ్కరీ సహకారంతో వాయువేగంతో అభివృద్ధి చేయడం హ్యాపీగా ఉందన్నారు.

ఈ క్రమంలోనే విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు సముద్రతీరంలో ఆరులైన్ల రహదారి ఏర్పాటు చేయాలని, దాన్ని 16వ నంబర్ నేషనల్ హైవేకు అనుసంధానించాలని జగన్‌ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అదే విధంగా.. విజయవాడ తూర్పు ప్రాంతంలో బైపాస్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల నుంచి బేస్తవారిపేట, సబ్బవరం నుంచి నర్సీపట్నం వరకు రోడ్లను అభివృద్ధి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Also Read: Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు