Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు షెడ్యూల్ వివరాలు ఇవే..

Kishan Reddy: తిరుపతి నుంచి ‘జన ఆశీర్వాద యాత్ర’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారులు...

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు షెడ్యూల్ వివరాలు ఇవే..
Kishan Reddy 2
Follow us

|

Updated on: Aug 19, 2021 | 8:09 AM

Kishan Reddy: తిరుపతి నుంచి ‘జన ఆశీర్వాద యాత్ర’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కిషన్ రెడ్డి వెంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా వెళ్లారు. రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ఏపీలో రెండు రోజులపాటు తిరుపతి, విజయవాడ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. ఇక తెలంగాణలో మూడు రోజుల పాటు సాగనుంది. కేంద్రంలో బీజేపీ పాలన ఏడేళ్లు పూర్తైన సందర్భంగా కిషన్ రెడ్డి ఈ జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు. తిరుపతి నుంచి బయలుదేరనున్న ఆయన.. నేరుగా విజయవాడకు చేరుకుంటారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి షెడ్యూల్ వివరాలు.. షెడ్యూల్ – 1 ఉదయం : 11.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు. షెడ్యూల్ – 2 ఉదయం 11.30 నిమిషాలకు విమానాశ్రంయ నుంచి బీజేపీ ఏర్పాటు చేసిన సభావేదిక వరకు జన ఆశీర్వాద యాత్ర లో భాగంగా మోటార్ సైకిల్, కార్ల తో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. షెడ్యూల్ – 3 మధ్యాహ్నం 12.00 నిమిషాలకు జన ఆశీర్వాద యాత్రలో భాగంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో సభ నిర్వహించనున్నారు. (విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు) షెడ్యూల్ – 4 మధ్యాహ్నం 1.30 నిమిషాలకు నేరుగా సీనియర్ పాత్రికేయులు, అకాల మరణం పొందిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు కుటుంబాన్ని కిషన్ రెడ్డి పరామర్శిస్తారు. షెడ్యూల్ – 5 మధ్యాహ్నం 1.40 నిమిషాలకు విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ – 6 మధ్యాహ్నం 2 .30 విజయవాడలోని వ్యాక్సిన్ సెంటర్‌ను సందర్శిస్తారు. షెడ్యూల్ – 7 అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కు కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రానికి ప్రయాణమవుతారు. కోదాడలో ప్రవేశించిన తరువాత ఆయన.. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యాత్ర కోనసాగిస్తారు.

Also read: