విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్ర మంత్రి కుమార స్వామి.. ప్రైవేటీకరణ నిర్ణయంపై ఉత్కంఠ..

|

Jul 11, 2024 | 1:19 PM

విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్రమంత్రి హెచ్ డి కుమార స్వామి పర్యటిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ స్థితిగతులను పరిశీలిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారంపై పడింది. గత మూడు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కేంద్రం ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్టీల్‌ప్లాంట్‌ పై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారో అన్న ఆసక్తి ఉత్కంఠ అటు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా యావత్ దేశంలో నెలకొంది.

విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్ర మంత్రి కుమార స్వామి.. ప్రైవేటీకరణ నిర్ణయంపై ఉత్కంఠ..
Union Minister Kumara Swamy
Follow us on

విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్రమంత్రి హెచ్ డి కుమార స్వామి పర్యటిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ స్థితిగతులను పరిశీలిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారంపై పడింది. గత మూడు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కేంద్రం ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్టీల్‌ప్లాంట్‌ పై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారో అన్న ఆసక్తి ఉత్కంఠ అటు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా యావత్ దేశంలో నెలకొంది. ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉక్కు పరిశ్రమకు చేరుకున్న కేంద్ర మంత్రి కుమార స్వామి, మరికాసేపట్లో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలు నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంతో విశాఖ ఉక్కు భవిష్యత్​పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగుల ఆందోళన, జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సంస్థ నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి, కేంద్రమంత్రి రాకతో పరిస్థితి మారుతుందా? సెయిల్‌లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.

దీనిపై సానుకూలంగా స్పందించాలని ఈ మధ్యే ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామిని కలిశారు. స్టీల్ ప్లాంట్​పై ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని కోరారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ను విలీనం చేయడం వల్ల రెండు కంపెనీలు లాభపడతాయని వారు కుమారస్వామికి వివరించారు. ఇలా ఒక ప్రతిపాదన పెట్టిన 20 రోజుల్లో నేరుగా కేంద్ర మంత్రి పర్యటించడంతో ఏదో ఒక సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశగా ఎదురు చేస్తున్నారు ప్రజలు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని కేంద్ర మంత్రి కుమార స్వామి సందర్శించి, వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటారని మరో మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడించారు. కేంద్రమంత్రి పర్యటనతో వెంటనే అద్భుతాలు జరగవన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం మంత్రుల పరిధిలో ఉండదని స్పష్టం చేశారు. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. సెయిల్‌లో విలీనం ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి స్టీల్ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల అవగాహనకోసమే కేంద్ర మంత్రి కుమార స్వామి పర్యటన కొనసాగుతోందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..