Ugadi Holiday: తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ రోజున ఏప్రిల్ (April) 2వ తేదీని సెలవు దినంగా ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాలరాజు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఉగాది (Ugadi) రోజున కొత్త జిల్లాల (New District) ప్రకటన చేస్తున్నందున ఏప్రిల్ 2న సెలవుల లేదని ప్రకటించింది ప్రభుత్వం. దీనిపై పలు విజ్ఞప్తులు రావడంతో సెలవు ప్రకటించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తేదీని ఏప్రిల్ 4కు వాయిదా వేసింది ప్రభుత్వం. దీంతో ఉగాది పండగకు సెలవు ఇచ్చేసింది.
4న కొత్త జిల్లాల ఏర్పాటు
కాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కూడా ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల అవతరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన ఆయన.. మౌలిక సదుపాయాల కల్పన, అధికారుల విభజనపై అధికారులతో చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఏప్రిల్ 2న ఉగాది రోజున ఉంటుందని భావించినా.. ప్రభుత్వం మాత్రం రెండు రోజులు ఆలస్యంగా ముహుర్తం ఖరారు చేసింది.
ఇవి కూడా చదవండి: