Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి...
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. లారీలో ఉన్న ఇద్దరు, బస్సులోని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు అయ్యాయి. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: