Andhra Pradesh: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఇద్దరు మహిళలు.. పెళ్లిచేసుకున్నాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి..
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో లింగభేదంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు...
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో లింగభేదంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా సమాజం కూడా వాటిని అంగీకరిస్తోంది. మొన్నామధ్య.. ఒక అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. గుజరాత్ లో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు పెండ్లిమర్రి మండలం మిట్టమీద పల్లెకు చెందిన ఓ వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లైంది. వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో వారు విడిపోయారు. ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఆ మహిళకు వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన తమ బంధువైన మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆగస్టు 6వ తేదీన ఈ ఇద్దరు మహిళలు శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. అనంతరం వేంపల్లె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, విషయం చెప్పి, తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, బంధువులకు అప్పగించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి