వారందరూ స్నేహితులు. పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో స్నానం చేసేందుకు గోదావరి (Godavari) నది వద్దకు వెళ్లారు. నీటిలో దిగిన విద్యార్థులు.. అక్కడే ఊబి ఉందనే విషయాన్ని గమనించలేదు. ఈత కొడుతూ ఊబిలో చిక్కుకున్నారు. స్నేహితుల కళ్లెదుటే నీటిలో మునిగిపోయారు. కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తమతో పాటు ఆనందంగా గడిపిన స్నేహితులు.. కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం (Tragedy) అలుముకుంది. తూర్పుగోదావరి జిల్లా చెముడులంకకు చెందిన రాహుల్, రోహిత్, చొప్పెళ్లకు చెందిన జినేంద్ర, వినయ్, కౌశిక్ లు స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో స్నానం చేసేందుకు గోదావరి నది (River) కి వెళ్లారు. బైక్ పై బడుగువానిలంక వద్ద రేవుకు వెళ్లారు. స్నానం చేద్దామని నీటిలోకి దిగారు. అక్కడ ఊబి ఉన్న విషయాన్ని గమనించని రాహుల్, రోహిత్ లు అందులో చిక్కుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన మిగతా స్నేహితులు మునిగిపోతున్న వారిని కాపాడేందుకు శాయాశక్తులా ప్రయత్నించారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఊబిలో మునిగిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. తొలుత రాహుల్, ఆ తర్వాత రోహిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. రోజూ తమ కళ్ల ముందే ఆడుకునే చిన్నారులు ఇక లేరని తెలియడంతో చెముడులంక గ్రామంలో విషాదం నెలకొంది. రాహుల్‌కు తండ్రి లేరు. తల్లి దుబాయ్‌లో ఉంటున్నారు. అతను చెముడులంకలో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నాడు. తన కొడుకు ఏడని కుమార్తె అడిగితే ఏమని బదులివ్వాలని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read
IT Alert: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ విషయాలు పూర్తి చేశారా.. వెంటనే కంప్లీట్ చేయండి..
Reliance Jio: ఇంటర్‌నెట్ వినియోగదారుల కోసం జియో రెండు సరికొత్త ప్లాన్స్.. పూర్తి వివరాలు..