Andhra: ఆఫీసుకొచ్చిన సిబ్బంది ఒక్కసారిగా భయపడ్డారు.. ఎదురుగా కనిపించిన సీన్ చూడగా

ఉదయాన్నే ఎవరి పనులకు వాళ్లు వచ్చారు. కట్ చేస్తే.. కాసేపటికే ఒక్కసారిగా అలజడి రేగింది. అదేంటి అని బయటకు వచ్చి చూడగా.. దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Andhra: ఆఫీసుకొచ్చిన సిబ్బంది ఒక్కసారిగా భయపడ్డారు.. ఎదురుగా కనిపించిన సీన్ చూడగా
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2025 | 1:47 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ(ఐ.టీ.డీ.ఏ) కార్యాలయంలో గిరిజనులు, అధికారులు నిత్యం తిరిగే కార్యాలయంలో నాగుపాము, మరొక పాము ప్రత్యక్షమయ్యాయి. పాములను చూసిన అధికారులు, గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. గురువారం నాగుపాముతో పాటు మరొక పామును పట్టుకున్నారు. ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో రెండు పాములు గుర్తించిన సిబ్బంది స్నేక్ క్యాచర్ ముస్తక్ సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ ముస్తాక్ ఎంతో చాకచక్యంగా రెండు పాములను పట్టుకొని, వాటిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. కార్యాలయంలో అందరూ ఉండగానే నాగుపాము సంచరించటంతో సిబ్బంది ఒక్కసారిగా భయాందోళన చెందారు.