AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ చిన్న కోడలికి వేధింపులు

ఇంతకంటే దారుణం ఉంటుందా..? బావకి పిల్లలు అందడం లేదు.. అతనికి కూడా వారసుడ్ని అందించు అంటూ.. చిన్న కోడలికి వేధిస్తున్నారు అత్తమామలు. ఇంత జరుగుతున్నా ఆమె భర్త మూగి మొద్దులా ఉంటూ ఏమీ పట్టించుకోవడం లేదు. దీంతో తనను కాపాడాలంటూ పుట్టింటివారికి కబురు పెట్టింది ఆ యువతి...

Andhra: భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ చిన్న కోడలికి వేధింపులు
In Laws Harassment
Ram Naramaneni
|

Updated on: Oct 31, 2025 | 3:32 PM

Share

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం వెలుగుచూసింది. భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ చిన్నకోడలిని వేధిస్తున్నారు అత్తమామలు. బావకి పిల్లలు లేరు కాబట్టి అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని వేధించారు. అంగీకరించకపోవటంతో గదిలో బంధించారు.

పోలవరానికి చెందిన యువతికి జంగారెడ్డిగూడెంకి చెందిన రంజిత్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సున్న బాబు ఉన్నాడు. అయితే బాధితురాలి భర్తకు అన్న అయిన ప్రవీణ్‌కు వివాహం జరిగి ఎనిమిది ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో బావ ప్రవీణ్‌కు పిల్లలను కనివ్వాలంటూ అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. అంగీకరించకపోవడంతో నిర్భంధించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను ఆదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

తన చెల్లిని తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి అన్న ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. బాధితురాలని వేధిస్తున్న నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు స్థానికులు, మహిళా సంఘం నాయకులు. ఈ ఇష్యూపై ఫిర్యాదు అందిందని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే బాధితురాలి ఆరోపణలను అత్తమామలు ఖండిస్తున్నారు. తాము వేధించలేదని చెబుతున్నారు. తమది అలాంటి కుటుంబం కాదని.. తమపై కట్టు కథలు అల్లుతున్నారని.. విచారణలో నిజాలు తెలుస్తాయంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి