ఎన్నికల సమయంలో ఇచ్చిన మద్యం తాగి బావబామ్మర్ది ఇద్దరూ మరణించిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పండుగ వేళ అచ్చంపేట మండలం చామర్రులో నిల్వ ఉంచిన మద్యం తాగి ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మద్యం తాగి బావ, బావమరిది మృతి చెందారు. వివరాల ప్రకారం.. చామర్రులో కోటయ్య (80) అనే వృద్ధుడు మృతి చెందగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.. ఆ తర్వాత మృతుడి కుమారుడు నాగేశ్వరరావు(45), అల్లుడు తెల్లమేకల నాగేశ్వరరావు (40) ఇద్దరూ రాత్రి వేళ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిల్వ ఉంచిన మద్యం తాగారు.. అయితే.. కొద్దిసేపటి తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి.. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఇద్దరినీ సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే.. సత్తెనపల్లి ఆస్పత్రిలో ఇద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.. అయితే వారు తాగిన మద్యం ఇప్పటిది కాదని, ఎన్నికల సమయం నాటిదని బంధువుల్లో ఒకరు బయటకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది..
ఈ విషయాన్ని బయటకు రాకుండా కుటుంబసభ్యులు ప్రయత్నించినప్పటికీ.. ఈ విషయం పోలీసుల వరకు చేరింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.. అయితే.. కుటుంబసభ్యలు మృతదేహాలను వారి వారి గ్రామాలకు తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీలను బంధువులకు అప్పగించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలుంటాయని అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్ తెలిపారు.
ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇద్దరు మృతి చెందడంపై ఎంక్వైరీ చేపట్టారు. చామర్రులోని మృతుల నివాసాలకు వెళ్ళిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్‌రెడ్డి.. పలు వివరాలు సేకరించారు. ఆ తర్వాత.. బావ, బావమరిది మృతిపై బంధువుల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు.
తెల్లమేకల నాగేశ్వరరావుది ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామమని కుటుంబసభ్యులు తెలిపారు.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..