Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్లు విడుదల అప్పుడే..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఆసక్తిచూపిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా నిత్యం స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశం దర్శనం టోకన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు.

Ttd To Release Tirumala Srivari Special Entrance Darshan And Accommodation Quota On November 24

Updated on: Nov 23, 2023 | 7:29 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఆసక్తిచూపిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా నిత్యం స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశం దర్శనం టోకన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు.

నవంబర్ 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో దర్శనం టికెట్లను భక్తులందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా దర్శనం కల్పించేందుకు ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేసింది. అలాగే వసతులకు సంబంధించిన కోటాను కూడా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి అద్దెగదులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..