Tirumala: తిరుమలలో పొలిటికల్ బ్యానర్ ప్రదర్శించిన భక్తులు.. టీటీడీ సీరియస్..

తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో తమిళనాడుకు చెందిన యువకులు రాజకీయ బ్యానర్ ప్రదర్శించడంపై టీటీడీ సీరియస్‌గా స్పందించింది. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పలని స్వామి ఫోటోలతో కూడిన ఏడీఎంకే బ్యానర్‌ను ప్రదర్శించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Tirumala: తిరుమలలో పొలిటికల్ బ్యానర్ ప్రదర్శించిన భక్తులు.. టీటీడీ సీరియస్..
Tirumala Temple News

Edited By:

Updated on: Dec 18, 2025 | 7:59 PM

తిరుమలలో తమిళనాడుకు చెందిన యువకులు హల్‌చల్ చేసారు. శ్రీవారి ఆలయం వద్ద ఏడీఎంకే బ్యానర్‌ను తమిళనాడు యువకులు ప్రదర్శించారు. ఇన్ స్టాలో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టిటిడి విజిలెన్స్ గుర్తించింది. ఈ మేరకు ఆరా తీసిన టీటీడీ సెక్యూరిటీ..  పోలీసులకు పిర్యాదు చేసింది. మాజీ సీఎంలు జయలలిత పలని స్వామిల ఫోటోలతో 2026 ఎన్నికల్లో ఏడీఎంకే విజయం సాధించాలంటూ పొలిటికల్ బ్యానర్‌ను యువకులు ప్రదర్శించారు. 23 సెకండ్ల విడిది ఉన్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో అసలు ఆ బ్యానర్‌తో యువకులు తిరుమలకు ఎలా చేరుకున్నారన్న దానిపై టిటిడి ఆరా తీస్తోంది. తమిళనాడు మాజీ సీఎంల ఫొటోలతో కూడిన బ్యానర్ ప్రదర్శిస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తోందని విచారిస్తోంది. తిరుమలలో నిబంధనలను అతిక్రమించి పొలిటికల్ బ్యానర్ ప్రదర్శించి వీడియో తీసుకున్న యువకులను ఎందుకు గుర్తించలేకపోయింది, నిఘా వైఫల్యం ఎక్కడుందన్న దానిపై దర్యాప్తు చేస్తోంది.

టీటీడీ సీరియస్…

తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫోటోలతో బ్యానర్ ప్రదర్శనను టీటీడీ సీరియస్‌గా పరిగణిస్తోంది. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్ ప్రదర్శించినట్లు దృష్టికి వచ్చిందని ప్రకటనలో పేర్కొంది. బ్యానర్‌ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకులపై చర్యలకు సిద్ధమయింది. ఈ మేరకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకటించిన టీటీడీ నిఘా వైఫల్యంపై చర్యలకు ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.