AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.  సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపింది.

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2020 | 4:46 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.  సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో నియంత్రణకు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో భూదేవి కాంప్లెక్స్​లో మాత్రమే సర్వదర్శన టోకెన్లు జారీ చేసేవారు. తాజాగా విష్ణు నివాసం వసతి గృహంలోనూ టికెట్ల జారీని స్టార్ట్ చేశారు.  బస్టాండ్​, రైల్వే స్టేషన్‌కు వచ్చే యాత్రికుల కోసం విష్ణు నివాసంలో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీ, కరోనా నేపథ్యంలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల సెంటర్లను టీటీడీ పెంచింది.

విష్ణునివాసంలో 24 గంటల పాటు సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 3 వేల నుంచి 10 వేల వరకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని వెల్లడించింది. దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తుండగా.. సర్వదర్శనానికి సంబంధించి ఒకరోజు ముందుగా టికెట్లను జారీ చేస్తున్నారు.

Also Read :

Flash : అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్

ఈ నెలాఖరులో యాసంగి ‘రైతుబంధు’ !

డేరా బాబాకు రహస్యంగా ఒక రోజు పెరోల్

Follow Us