TTD: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న బోర్డు సభ్యులు..

|

Jun 19, 2021 | 8:16 AM

TTD Meeting Today: టీటీడీ పాలకమండలి సమావేశం ఈ రోజు జరుగనుంది. శ్రీవారి ఆలయంలో దర్శనాల సంఖ్య పెంపుతోపాటు.. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు పాలక మండలి

TTD: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న బోర్డు సభ్యులు..
Tirumala Tirupati Devasthanams
Follow us on

TTD Meeting Today: టీటీడీ పాలకమండలి సమావేశం ఈ రోజు జరుగనుంది. శ్రీవారి ఆలయంలో దర్శనాల సంఖ్య పెంపుతోపాటు.. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు పాలక మండలి ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశం కానుంది. 85 అంశాలతో ఎజెండాను రూపొందించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రధానంగా గరుడ వారధిని అలిపిరి వరకు విస్తరణకు నిధుల కేటాయింపు పై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు కళ్యాణమస్తు, మారుమూల ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంపై పాలక మండలిలో చర్చించనున్నారు. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో దర్శన టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కర్ణాటకకు చెందిన నందిని డైరీ పాల ఉత్పత్తుల విక్రయానికి ఔట్ లెట్ల కేటాయింపులపై కూడా చర్చ జరిగే అవకాశముంది. టీటీడీ ఆస్పత్రుల్లో మందులు కొనుగోళ్లపై చర్చ జరుగనుంది. టీటీడీ విద్యాసంస్థల్లో హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేసే అంశంపై కూడా చర్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో త్వరలో 500 ఆలయాల నిర్మాణం చేపట్టాలనే అంశంపై సమావేశంలో చర్చిస్తారు.

అంతేకాకుండా భద్రతను మరింత పటిష్టం చేసేందుకు మూడో దశలో రూ.16 కోట్ల ఖర్చుతో తిరుమలలో 1389 సీసీ కెమెరాల ఏర్పాటుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసి బోర్డుకు సమర్పించారు. దీనిపై కూడా నిర్ణయం తీసకునే అవకాశముంది. తిరుమలలోని పవన విద్యుత్ కేంద్ర నిర్వహణను హైదరాబాద్ కు చెందిన గ్రీన్ కో సంస్థకు అప్పగించేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పేరూరులోని వకులామాత ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు రూ.2.90 కోట్లను శ్రీవాణి ట్రస్టు నిధుల నుండి కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు. తిరుమల భద్రతకు తలపెట్టిన కంచె నిర్మాణంలో భాగంగా మూడో దశ నిర్మాణ పనులకు రూ.7.37 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.

Also Read:

Brahmamgari Matam: ముదురుతున్న బ్రహ్మంగారి మఠం వారసత్వ వివాదం.. త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామన్న మంత్రి వెల్లంపల్లి

TTD Chairman YV Subba Reddy: ఈనెల 21తో ముగియనున్న టీటీడీ ఛైర్మన్ పదవీకాలం.. మరోసారి వైవీ సుబ్బారెడ్డికే ఛాన్స్?