TTD: ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్.. 4 వేల ఇళ్ల స్థలాల పంపిణీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు, పెన్షనర్లకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. దీంతో దాదాపు 9 వేల మంది సిబ్బందికి ల్యాండ్ డీడ్ డాక్యుమెంట్లను అందజేసింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొని అందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు, పెన్షనర్లకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. దీంతో దాదాపు 9 వేల మంది సిబ్బందికి ల్యాండ్ డీడ్ డాక్యుమెంట్లను అందజేసింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొని అందించారు. కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డితో కలిసి లబ్ధిదారులు, విశ్రాంత సిబ్బందికి పట్టాలు అందజేశారు. “నా జీవితం ఆశీర్వదించబడింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ కాలంలోనే 9 వేల మంది టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత సిబ్బంది లబ్ధి పొందడం సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో భూమన చైర్మన్ గా ఉన్న సమయంలో టిటిడి ఉద్యోగులకు ఇళ్లు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అయితే ఈ ప్రయత్నానికి అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే దివంగత వైఎస్సార్ తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడంతో ఇళ్ల స్థలాల పంపిణీ విజయవంతమైంది. కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన ఉద్యోగులను కోరారు. కోర్టు కేసుల కారణంగా ఇళ్ల స్థలాల పట్టాలు కేటాయించని వారికి కూడా రాబోయే రోజుల్లో పట్టాలు ఇస్తామని చెప్పారు.
వడమాలపేట సమీపంలోని పడిరేడు అరణ్యంలో సుమారు 450 ఎకరాల భూమిని సేకరించడానికి నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా సహకరించడంతో ఇళ్ల స్థలాల కేటాయింపు సాధ్యమైంది. దాదాపు టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసిన టీటీడీ చైర్మన్, కార్యనిర్వహణాధికారికి టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దూర ప్రాంతాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే రోగులకు మెరుగైన సేవలందించేందుకు టీటీడీ నర్సుల ఉద్యోగుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నర్సుల నియామకాంతో తిరుమల దర్శనం కోసం వచ్చే రోగులు మరిన్ని వైద్యపరమైన సేవలు పొందొచ్చు.