Telangana – AP: ట్రాఫిక్ తప్పించుకోవాలా.. ఇదిగో ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఊర్లకు వెళ్లండి..

|

Jan 11, 2025 | 10:16 AM

నగరం.. పల్లెబాట పట్టింది. జిల్లాలకు వెళ్లే నేషనల్ హైవేలపైనా భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. హైదరాబాద్‌ విజయవాడ హైవేపై పుల్‌ రష్‌ ఏర్పడింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాల రద్దీ నివారించేందుకు పోలీసులు, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా చర్యలు చేపట్టింది. కాగా ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్తే ట్రాఫిక్ తప్పించుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.

Telangana - AP: ట్రాఫిక్ తప్పించుకోవాలా.. ఇదిగో ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఊర్లకు వెళ్లండి..
Sankranthi Rush
Follow us on

విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం వెళ్లే ప్రయాణికులంతా ఎక్కువగా ప్రిపే ర్‌చేసే రూట్‌ హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవే. మ్యాగ్జిమమ్ అందరూ ఈ రూట్‌లోనే వెళ్తారు. సాధారణ రోజుల్లో అయితే ఓకే. మరి, హాలీడేస్‌, పండగ రోజుల్లో అయితే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయ్‌. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరతాయ్‌. వాహనం కదలాలంటే.. ఒక్కోసారి గంటల తరబడి వెయిట్‌ చేయాల్సి వస్తుంది. నగర శివార్లలోని దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి చౌటుప్పల్‌ వెళ్లాలన్నా కనీసం మూడు నాలుగు గంటలు టైమ్‌ పడుతుంటుంది. అంటే, గంటలో వెళ్లాల్సిన దూరానికి నాలుగు గంటలు పట్టడం ఖాయం. ఇక, పంతంగి టోల్‌ప్లాజా దగ్గర పరిస్థితి అయితే మరీదారుణంగా ఉంటుంది. ఇక్కడ బంపర్‌ టు బంపర్‌ వెళ్తుంటాయ్‌ వాహనాలు. మరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా?. హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవే ఒక్కటే మార్గమా? పోలీసులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి…

సంక్రాంతి ప్రయాణికులకు హైదరాబాద్‌ పోలీసులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై రద్దీతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడితే ప్రయాణం సాఫీగా సాగుతుంది అంటున్నారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం వైపు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటున్నారు. ట్రాఫిక్‌జామ్స్‌ను తప్పించుకోవాలంటే ఈ రూట్స్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.  గుంటూరు, నెల్లూరు వెళ్లేవారికి.. నాగార్జునసాగర్‌ మీదుగా ప్రత్యామ్నాయ రూట్ ఉందంటున్నారు. విజయవాడ, ఖమ్మం వెళ్లేవారికి.. భువనగిరి, రామన్నపేట మీదుగా మార్గం ఉందని గుర్తు చేస్తున్నారు.

రూట్ 1

హైదరాబాద్‌ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నారు పోలీసులు. సాధారణంగా వీళ్లంతా హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో నార్కెట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై వెళ్తుంటారు. దాంతో, వీళ్లంతా హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, చౌటుప్పల్‌, పంతంగి దగ్గర చిక్కుకుపోవడం ఖాయం. అయితే, వీళ్లందరికీ ప్రత్యామ్నాయ మార్గం ఉంది. కొంత దూరం పెరిగినా.. హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవేను ఎంచుకుంటే ప్రయాణం సాఫీగా సాగుతుందంటున్నారు పోలీసులు.

హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవే నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లాలంటే.. ఓఆర్‌ఆర్‌ నుంచి బొంగులూరు గేట్‌ దగ్గర ఎగ్జిట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి నేరుగా నాగార్జునసాగర్‌ హైవేపైకి వెళ్లిపోవచ్చు.

రూట్ 2

అలాగే.. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించారు పోలీసులు. భువనగిరి, రామన్నపేట, చిట్యాల మీదుగా నార్కట్‌పల్లి చేరుకుంటే వీళ్లకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పినట్టే.!. ఎందుకంటే, నార్కట్‌పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వెళ్తుంటాయ్‌. అలాగే, కొర్లపహాడ్ టోల్‌గేట్‌ దాటిన తర్వాత మరికొన్ని వాహనాలు ఖమ్మం వైపు వెళ్తుంటాయ్‌. మిగతా వాహనాలు మాత్రమే విజయవాడ వైపు వెళ్తాయి. అంటే, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు.. భువనగిరి, రామన్నపేట, చిట్యాల మీదుగా నార్కట్‌పల్లి చేరుకుంటే ట్రాఫిక్‌ తిప్పల్ని తప్పించుకోవచ్చు.

— హైదరాబాద్‌ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు.. ఓఆర్‌ఆర్‌ పైనుంచి ఘట్‌కేసర్‌ దగ్గర ఎగ్జిట్‌ తీసుకుని వరంగల్‌ హైవేలోకి వెళ్లాలి. అలాగే, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌ మీదుగా కూడా భువనగిరి వెళ్లొచ్చు.

మరిన్ని రాష్ట్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..