Andhra: దుమ్ము రేపిన పొట్టేళ్ల పందాలు.. రూల్స్ ఏంటో తెలుసా..?

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణింగవరం గ్రామంలో నిర్వహించిన సంప్రదాయ పొట్టేళ్ల పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పక్క గ్రామాలతో పాటు ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల నుంచి దాదాపు 41 జతల పొట్టేళ్లు పోటీల్లో పాల్గొనగా… ఉత్కంఠభరితంగా సాగిన పందెం పోటీలతో గ్రామమంతా సందడి నెలకొంది.

Andhra: దుమ్ము రేపిన పొట్టేళ్ల పందాలు.. రూల్స్ ఏంటో తెలుసా..?
Ram Fights

Edited By:

Updated on: Jan 01, 2026 | 8:16 PM

ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణింగవరం గ్రామంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోట్టేళ్ల పోటీలు ఆకట్టుకున్నాయి… గ్రామంలో నిర్వహించిన పొట్టేళ్ల పందెం పోటీలకు స్థానికులు, పక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాల నలుమూలల నుంచి దాదాపు 41 జతల పొట్టేళ్లు తరలివచ్చాయి. పోటీలు ఆద్యంతం నువ్వా-నేనా అన్నట్లుగా సాగాయి… పొట్టేళ్లు ఒకదానికొకటి ఢీకొంటున్న సమయంలో ప్రేక్షకుల ఈలలు, కేకలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు బోరెడ్డి ఓబుల్ రెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, పండుగ సమయాల్లో ప్రజల మధ్య ఐక్యతను చాటడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు… పోటీల అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు.

సంప్రదాయ క్రీడలో భాగమేనా…

పొట్టేళ్ల పందాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ క్రీడగా నిర్వహిస్తారు. సాధారణంగా సంక్రాంతి, దసరా పండుగల సమయంలో, గ్రామాల్లో జాతరలు జరిగే సమయాల్లో ఎడ్ల పందాలతో పాటు పొట్టేళ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పందెం పోట్టేళ్లను ప్రత్యేకంగా పెంచుతారు… వీటికి కందులు, ఉలవలు, బాదం, పిస్తా వంటి బలమైన ఆహారాన్ని పెట్టి వస్తాదుల్లా తయారుచేస్తారు. వీటికి ఈత, పరుగు, ప్రతిరోజూ నడక వంటి తర్భీదులు ఇస్తారు… పొట్టేళ్ల బరువు, వాటి వయస్సు ఆధారంగా పోటీలల్లో విభాగాలను నిర్ణయిస్తారు… రెండు పోట్టేళ్లు పలుమార్లు ఢీకొన్న తరువాత ఏది వెనకడుగు వేసి తిరిగి ఢీకొట్టకుండా బరినుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుందో అది ఓడిపోయినట్టు. ఢీ అంటే ఢీ అంటూ బరిలో నిలిచిన పొట్టేలను గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే జంతువును క్రూరంగా హింసించడం వంటి విషయాల్లో కొన్ని జంతు హింస నిరోధక చట్టాలు ఉన్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు తీసుకుని నిర్వహిస్తుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..