Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ ఈరోజు (జులై7) రూ.300 ల ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను విడుదల చేసింది . సెప్టెంబర్ నెలలో వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు పొందాలనుకునే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను అందుబాటులో ఉంచింది. శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇక శుక్రవారం (జులై8) సెప్టెంబర్ నెలకుగాను వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక వేసవి సెలవులు ముగుస్తుండడతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి సర్వ దర్శనానికి సుమారు 9 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై జూలై 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి.