Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ పది రోజులు టోకెన్‌ లేకుంటే దర్శనం బంద్

టీటీడీ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించనట్లు టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ పది రోజులు టోకెన్‌ లేకుంటే దర్శనం బంద్
Tirupati
Follow us
Raju M P R

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 15, 2024 | 7:03 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించింది. 10 రోజులపాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతించనున్న టీటీడీ ఈ మేరకు టోకెన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు కూడా తీసుకుంది. భక్తులు ఈ మేరకు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించనుంది. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించినా దర్శనం చేసుకునే అవకాశం ఉండదని పేర్కొంది.

చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేసింది. ఇక ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేసినట్లు ప్రకటించింది. భారీ క్యూలైన్ల నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేసింది. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేసింది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారని ప్రకటించింది.  భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచిస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్‌లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతి ఇచ్చామని పేర్కొంది. జనవరి 11 నుండి 19 వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారని టీటీడీ చెప్తుంది. ఇక 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్, గైడ్స్‌ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుందని టీటీడీ పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి