TTD Parakamani: శ్రీవారి కానుకల లెక్కింపు ఇకపై మరింత సులువు.. ఏ రోజు కానుకలు ఆ రోజే సంపూర్తి..

|

Feb 20, 2023 | 7:27 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కోరిన వారి కోర్కేలు తీర్చే కోంగుబంగారు దేవుడైన శ్రీవారికి తమ మ్రోక్కులు కానుకల రూపంలో చెల్లిస్తుంటారు. ఇలా హుండీకి ఏటా వేల కోట్ల..

TTD Parakamani: శ్రీవారి కానుకల లెక్కింపు ఇకపై మరింత సులువు.. ఏ రోజు కానుకలు ఆ రోజే సంపూర్తి..
New Parakamani At Ttd
Follow us on

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కోరిన వారి కోర్కేలు తీర్చే కోంగుబంగారు దేవుడైన శ్రీవారికి తమ మ్రోక్కులు కానుకల రూపంలో చెల్లిస్తుంటారు. ఇలా హుండీకి ఏటా వేల కోట్ల రూపాయలు కానుకల రూపంలో భక్తులు సమర్పించుకుంటుంటారు. ఇక బంగారం అయితే వెయ్యి కేజీల వరకు ఉంటుంది. వెండి కానుకలు మూడు వేల కేజీలకు పైమాటే. వీటితో పాటు విలువైన వజ్రవైడుర్యాలు సైతం స్వామివారి హుండీలో చేరుతుంటాయి. వీటి బరువు 20 కేజీలకుపైనే ఉంటుంది. వచ్చిన కానుకలను గతంలో ఆలయంలోని పరకామణిలో లెక్కించేవారు. భద్రత దృష్ట్యా తక్కువ స్థలంలో లెక్కించేవారు. దీంతో కానుకల్లోని దుమ్ముధూళి వల్ల సిబ్బందికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తేవి. ఒకదశలో పరకామణి సిబ్బంది విధులకు హాజరవ్వడానికి కూడా వెనకాడేవారు. దీంతో టిటిడి కొద్ది రోజులు బ్యాంకుల సహకారంతో, శ్రీవారి సేవకుల సహకారంతో పరకామణి లెక్కింపులు నిర్వర్తించవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

శ్రీవారి ఆలయం ఎదుట సువిశాలమైన ప్రాంతంలో బెంగళురుకి చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో 23 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మించింది. సెల్లార్‌లో లాకర్లు, గ్రౌండ్ ఫ్లోర్‌లో నాణేల లెక్కింపు, మెదటి అంతస్థులో నోట్ల లెక్కింపులు చేసేలా ఏర్పాటు చేసారు. విశాలమైన ప్రదేశం అందుబాటులోకి రావడంతో కానుకలు లెక్కించే సిబ్బంది ఏ రోజు కానుకలను ఆ రోజే చకచకా లెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.