Tirumala: శ్రీవారి భక్తులూ.. ఈ విషయం తప్పక తెలుసుకోండి…

| Edited By: Ram Naramaneni

Dec 21, 2024 | 10:21 AM

మార్చి 2025లో వివిధ మతపరమైన సేవలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల షెడ్యూల్‌‌లో స్పల్ప మార్పులు చేసినట్లు టిటిడి తెలిపింది. సుప్రభాతం, తోమాల, మరియు అష్టదళపద పద్మారాధన వంటి సేవల కోసం ఆన్‌లైన్ కోటా కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఈ వివరాలు తెలుసుకుంటే మంచిది. మరిన్ని వివరాలకు టిటిడి అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించండి.

Tirumala: శ్రీవారి భక్తులూ.. ఈ విషయం తప్పక తెలుసుకోండి...
Tirumala
Follow us on

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం టిటిడి జారీ చేయనున్న మార్చి నెల కోటాపై స్పష్టత వచ్చింది. మార్చి నెలలో స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు టిటిడి చేసిన మార్పులను గుర్తించాల్సి ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి నెల కోటా టికెట్ల జారీ తేదీలను టిటిడి మార్పు చేయాల్సి వచ్చింది. శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు పై క్లారిటీ ఇచ్చింది.

డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనుంది. డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయాలని నిర్ణయించింది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను కూడా విడుదల చేయబోతోంది. ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేస్తోంది.

ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో టిటిడి డైరీలు, క్యాలెండర్లు

భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్‌లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా టిటిడి ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కళ్యాణమండపాల్లో 2025 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది.

టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేసేందుకు కల్పించిన సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది టిటిడి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..