ఆంధ్రప్రదేశ్, జనవరి01; కలియుగ ప్రత్యక్ష దైవం హుండీ ఆదాయం గత రెండేళ్లుగా పోటీపడుతోంది. సామాన్యుడి నుంచి సంపన్నుడు దాకా తిరుమల వెంకన్న హుండీలో కానుకలు సమర్పించి బుక్కులు తీర్చుకుంటున్నాడు. దీంతో తిరుమలేశుడి దర్శించుకునే భక్తుల సంఖ్య కు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా నమోదు అవుతోంది. గత రెండేళ్లుగా ప్రతినెల హుండీలో సమర్పించే కానుకల ఆదాయం మొత్తం రూ.100 కోట్ల పై మాటేగానే ఉంటుంది. 22 నెలలుగా రూ. 100 కోట్లు పైగానే ప్రతినెల హుండీ ఆదాయం టిటిడికి జమ అవుతోంది. ఇప్పటికే రూ 17 వేలకోట్ల కు పైగా వెంకన్న ఖాతాలో బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండగా కోరుకున్న కోర్కెలు తీర్చే ఏడుకొండలవాడికి అదే స్థాయిలో కానుకలు సమర్పిస్తున్న భక్తులు తిరుమల వెంకన్న హుండీ ఆదాయాన్ని అంతకంతకు పెంచుతున్నట్లు స్పష్టం అవుతోంది. రోజూ రూ. 3.50 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు వెంకన్న హందీకి ఆదాయం చేరుకుంటోంది.
ఇలా గత డిసెంబర్ నెల రూ.116.70 కోట్ల కానుకలు వెంకన్న హుండీకి చేరింది. డిసెంబర్ నెల 31 రోజుల్లో 9 రోజులు ప్రతిరోజు రూ. 4 కోట్ల కు పైగా ఆదాయం హుండీ కి వచ్చింది. డిసెంబర్ 3, 7, 17, 18, 21, 25, 26, 28, 31 తేదీల్లో రోజూ రూ. 4 కోట్లకు పైగానే ఆదాయం గుండికి చేరింది. ఇక డిసెంబర్ 11 న రూ. 5.28 కోట్లు, వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు సమర్పించిన కానుకలు రూ. 5.05 కోట్లు గా డిసెంబర్ నెల 24 ఆదాయం టిటిడి హుండీ కి చేరింది. ఇలా క్షణం పాటు శ్రీవారి దర్శనం లభిస్తే చాలని భావించే భక్తులతో తిరుమల కొండ నిత్యం కిటకిట లాడుతున్నట్లే హుండీలో కానుకలు కూడా అదే రీతిలో సమర్పించే భక్తుల విరాళాల మొత్తాలు తిరుమల వెంకన్న ఆదాయాన్ని పెంచుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..