Immunity Booster Bouquet: ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి ఆవశ్యకతపై అందరికి ఇప్పటికే చాలా మందికి అవగాహన పెరిగింది. తాజాగా తిరుపతి తిలక్ రోడ్డులో గల బ్లూ పెటల్ ఫ్లోరిస్టు వారు ఈ నూతన సంవత్సరానికి ఆవిష్కరించిన ఇమ్మ్యూనిటి బూస్టర్ బొకేలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు, కమలా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో బొకేలు న్యూ ఇయర్ కు అందిస్తున్నారు.
వైద్యులు, పోషకాహార నిపుణులను సంప్రదించి, విటమిన్, సెలినియం, జింక్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ సంపద నిండిన ఆహార పదార్థాలను ప్రజలకు అందించడానికి ముందుకొచ్చామని బ్లూ పెటల్ అధినేత సాయికుమార్ రెడ్డి చెబుతున్నారు.
కొబ్బరికాయతో స్వాగతం పలికే భారతీయ సంప్రదాయానికి, పాశ్చాత్య బొకేలతో మేళవించడం ద్వారా పూర్వ వైభవం తేవడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. అలాగే, శుభాకాంక్షలు తెలపడంతో ఒక కొత్త ఒరవడి సృష్టించడం కూడా తిరుపతి నుంచే ప్రారంభం అవడం శుభసూచక
మంటున్నారు సాయికుమార్ రెడ్డి. ఏదైనా ఇలాంటి ఆలోచన భలేగా ఉందికదూ.
-ఎంపీఆర్ రాజు, తిరుపతి.