Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. సాలకట్ల బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం

| Edited By: Anil kumar poka

Sep 15, 2022 | 5:51 PM

TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు సర్వదర్శనం భక్తుకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి..

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. సాలకట్ల బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం
TTD
Follow us on

TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు సర్వదర్శనం భక్తుకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వెల్లడించారు. కాగా సెప్టెంబర్‌27వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్‌1న గరుడ వాహనం, 5వ తేదీన చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తాం. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు. అక్టోబర్‌ 1న గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల ఘాట్‌రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు’ అని ఈ వో తెలిపారు. ఇక ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటలకు శ్రీవారికి వాహన సేవలు నిర్వహిస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. కాగా స్కూళ్లు, థియేటర్లు తెరచుకున్న తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. రోజు 70వేల నుంచి 80వేల మంది దాకా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.4.71 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి