Tirumala Electric Bus: తిరుమల కొండపై ఎలక్ట్రిక్‌ బస్సులు.. త్వరలో అందుబాటులో.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

| Edited By: Ravi Kiran

Sep 20, 2022 | 10:11 AM

Tirumala Electric Bus: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు..

Tirumala Electric Bus: తిరుమల కొండపై ఎలక్ట్రిక్‌ బస్సులు.. త్వరలో అందుబాటులో.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌
Tirumala Electric Bus
Follow us on

Tirumala Electric Bus: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, కార్లు అందుబాటులోకి రాగా, మరికొన్ని కంపెనీలు త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా తిరుమల కొండపైకి కూడా ఎలక్ర్టిక్‌ బస్సు సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఒలక్ర్టా సంస్థ బస్సుతో చేసిన ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ సాధించింది. వారం రోజులపాటు ఘాట్‌ రోడ్డులో నడింపించి చేర్పులు మార్పులు చేయనున్నారు.

ప్రయోగాత్మకంగా పరిశీలన..

తిరుమల ఘాట్ రోడ్‌లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ నిపుణుల సమ‌క్షంలో రెండో ఘాట్ రోడ్డు నుండి ప్రయాణించిన ఎలక్ట్రిక్ బస్ తిరుమలకు చేరుకుంది. ఎత్తైన ప్రదేశాలు, మలుపులు దగ్గర బస్సు పనితీరును అధికారులు పరిశీలించారు. ఈ రన్‌పై స్పందించిన ఆర్టీసీ అధికారులు తిరుమల ఘాట్ రోడ్‌లో ఎలక్ట్రిక్ బస్సు పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ఎలక్ట్రిక్ బస్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా ఘాట్ రోడ్డు ప్రయాణం చేయవచ్చని చెప్పారు. తిరుమల-తిరుపతిల మధ్య ఈ నెలాఖరికి 10 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తిరుమల ఘట్ రోడ్డులో మొత్తం 50 విద్యుత్ బస్‌లు డిసెంబర్ చివరి నాటికి తిప్పడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే తిరుపతి నుండి ఇతర ప్రాంతాలకు విద్యుత్ బస్సులు నడపనున్నామని తెలిపారు.

మరిన్ని తిరుమల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి