Tirumala: శ్రీవారి లడ్డూలు టోకెన్ల విక్రయంలో కొత్త స్కామ్.. కౌంటర్ లో పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్.. 76 టోకెన్లు స్వాధీనం

|

Nov 04, 2022 | 6:10 PM

తిరుమల ఎంత ఫేమస్సో..  తిరుపతి లడ్డులు కూడా అంతే ఫేమస్. తిరుమలకు వెళ్లే భక్తులకే కాదు.. భక్తులు తీసుకొచ్చే లడ్డుల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. క్తుల ఈ బలహీనతను టీటీడీ సిబ్బందిలో కొందరు  క్యాష్ చేసుకుంటున్నారు.

Tirumala: శ్రీవారి లడ్డూలు టోకెన్ల విక్రయంలో కొత్త స్కామ్.. కౌంటర్ లో పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్.. 76 టోకెన్లు స్వాధీనం
Tirumala Laddu
Follow us on

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే విశిష్టత స్వామివారి లడ్డూకి కూడా ఉంది. దివ్యమంగళుడి రూపం శ్రీవారిని దర్శించుకుని జన్మ ధన్యమైనట్లు భావించే భక్తులు లడ్డు ప్రసాదం కోసం బారులు తీరతారు అంటే అతిశయోక్తి కాదు.. అవును తిరుమల ఎంత ఫేమస్సో..  తిరుపతి లడ్డులు కూడా అంతే ఫేమస్. తిరుమలకు వెళ్లే భక్తులకే కాదు.. భక్తులు తీసుకొచ్చే లడ్డుల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు

దర్శనం అయిన తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు భారీ క్యూలైన్లలో నిలబడతారు. మరికొన్ని లడ్డూలు దొరికితే బావుణ్ణు అనుకుంటారు. భక్తుల ఈ బలహీనతను టీటీడీ సిబ్బందిలో కొందరు  క్యాష్ చేసుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ టోకెన్ల విక్రయంలో కొత్త స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో పనిచేస్తున్న మస్తానయ్య అనే వ్యక్తి భక్తులకు టోకెన్లు ఇచ్చే సమయంలో పరిమితికి మించి టోకెన్లు జనరేట్‌ చేస్తూ పట్టుబడ్డాడు. మస్తానయ్య మరో ముగ్గురు వ్యక్తుతలో కలిసి టోకెన్లు పంచుకుంటుండగా గుర్తించి టీటీడీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో మస్తానయ్య, రాజేష్‌, హర్షవర్ధన్‌, శివ అనే నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మస్తానయ్య వద్దనుంచి అక్రమంగా విక్రయిస్తున్న 76 టోకెన్లు స్వాధీనం చేసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..