Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సైకో వీరంగం సృష్టించాడు. శ్రీవారి ఆలయం వద్ద సైకో గాజు సీసాతో తనని తాను పొడుచుకున్నాడు. సైకో సృష్టించిన భీభత్సంతో స్వామివారు భక్తులు భయాందోళకు గురయ్యారు. శ్రీవారి ఆలయ దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి ఆలయం వద్ద ఘటన చోటు చేసుకుంది. సైకోని వెంటనే టీటీడీ అధికారులు పోలీసులు చికిత్స నిమిత్తం అశ్వనీ ఆసుపత్రికి తరలించారు. సైకో కర్ణాటకకు చెందిన శశికుమార్ గా గుర్తించారు. మూడు చోట్ల గాయాలు అయినట్లు.. ప్రమాదం ఏమీ లేదని వైద్య సిబ్బంది చెప్పారు. శశికుమార్ కు మతిస్థిమితం లేకపోవడంతో గాయపరచుకున్నట్లు టీటీడీ విజిలెన్స్ వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..