Andhra Pradesh Omicron Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ నెల 12 ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు శాంపిళ్లను జీనోమ్ సీక్వేన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
214 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
కాగా.. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 214 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదు. అయితే.. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా ఢిల్లీలో 57 కేసులు వెలుగులోకి రాగా.. మహారాష్ట్రలో 54, తెలంగాణ 24, కర్నాటక 19, రాజస్థాన్ 18, గుజరాత్ 14, ఏపీలో 2 కేసులు ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకు 90 మంది బాధితులు కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు.
Also Read: